South Central Railway Summer Special Trains in Telugu States: ఈ ఎండాకాలం సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల మధ్య వీటిని నడపనుంది. ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలను మంగళవారం ట్విటర్‌లో కూడా ఉంచారు. తెలుగు రాష్ట్రాల్లో నడపనున్న స్పెషల్ రైళ్లు ఇవే..


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి..
* సికింద్రాబాద్‌–తిరుపతి (07438 / 07437) స్పెషల్‌ ట్రైన్‌ 13వ తేదీ సాయంత్రం 6.40 గంటలకు.. తిరుగు ప్రయాణంలో 14వ తేదీ సాయం త్రం 7.50 గంటలకు బయలుదేరుతుంది.
* సికింద్రాబాద్‌–కాకినాడ (07468 / 07469)13వ తేదీ రాత్రి 8.45 గంటలకు.. తిరుగు ప్రయాణం లో 17వ తేదీ రాత్రి 8.45 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.50గం.లకు సికింద్రాబాద్‌ మీదుగా వికారాబాద్‌కు చేరుకుంటుంది.
* సికింద్రాబాద్‌–బరంపూర్‌ (07586 / 07587) 13 సాయంత్రం 4.35 గంటలకు.. తిరుగు ప్రయాణంలో 14వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరుతుంది.
* సికింద్రాబాద్‌–నర్సాపూర్‌ (07439 / 07440) 15 రాత్రి 10.35 గంటలకు.. తిరుగుప్రయాణంలో 17రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది.


తిరుపతి నుంచి..
* తిరుపతి–సికింద్రాబాద్‌ (07585) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 17 సాయంత్రం 7.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.
* తిరుపతి–సికింద్రాబాద్‌ (07583/07584) స్పెషల్‌ ట్రైన్‌ 15వ తేదీ రాత్రి 9 గంటలకు.. తిరుగు ప్రయాణంలో 16వ తేదీ సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరుతుంది.


విజయవాడ నుంచి..
* విజయవాడ - సికింద్రాబాద్ (07441) రైలు ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మర్నాడు ఉదయం 4.10 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది.


హైదరాబాద్ (నాంపల్లి) / కాచిగూడ నుంచి..
* హైదరాబాద్‌ – నర్సాపూర్‌ (07477/07478) 13వ తేదీ సాయంత్రం 4.55 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 14వ తేదీ ఉదయం 7 గంటలకు అక్కడి నుంచి మొదలు అవుతుంది.
* కాచిగూడ–తిరుపతి (07297/07298) 13రాత్రి 10.20 గంటలకు.. తిరుగు ప్రయాణంలో 14 మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది.