విజయవాడ ఇంద్రకీలాద్రి పై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కీలక దశకు చేరుకున్నాయి. అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూల నక్షత్రం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ మళ్ళింపులు చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు. ఒక్క రోజులోనే రెండు లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తారని అదికారులు అంచనా వేస్తున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా, మూల నక్షత్రం రోజున అమ్మ వారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ట్రాఫిక్ రాకపోకలను మళ్ళించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రకటించారు.
01.10.2022 రాత్రి 11.00 గంటల నుంచి 02.10.2022 రాత్రి 11.00 గంటల వరకు ట్రాఫిక్ మళ్ళింపులు ఉంటాయని స్పష్టం చేశారు.
1. గద్దబొమ్మ, కే.ఆర్. మార్కెట్, కనకదుర్గా ఫ్లైఒవర్ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్ళు సిటీ, ఆర్.టి.సి బస్సులను పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి - పి.సి.ఆర్-> చల్లపల్లి బంగ్లా -> ఏలూరు లాకులు -> బి.ఆర్.టి.ఎస్ రోడ్ -> బుడమేరు వంతెన -> పైపుల రోడ్ -> వై.వి.రావు ఎస్టేట్ -> సి.వి.ఆర్ ఫ్లై ఓవర్ -> సితారా -> గొల్లపూడి వై జంక్షన్ మీదుగా ఇబ్రహీంపట్నం వైపునకు మళ్లించారు. పి.యన్.బి.యస్ సిటి బస్ స్టాండ్ నుంచిలో బ్రిడ్జి వైపునకు ఆర్.టి.సి.బస్సులకు అనుమతించడం లేదు.
2. ప్రకాశం బ్యారేజి మీదుగా తాడేపల్లి, మంగళగిరి వైపు వెళ్ళు వాహనములు కనక దుర్గమ్మ వారధి మీదుగా వెళ్ళాల్సి ఉంది.
3. భవానిపురం వైపు నుంచి నగరంలోకి వచ్చే కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనములు కుమ్మరిపాలెం -సితారా ,కబెళా, సి.వి.ఆర్ ఫ్లై ఓవర్, మిల్క్ ప్రాజెక్ట్ , చిట్టినగర్, వి.జి.చౌక్, పంజా సెంటర్ , పండిట్ నెహ్రు రోడ్, లో బ్రిడ్జి ద్వార నగరంలోనికి పంపుతున్నారు.
4. పి.సి.ఆర్ వైపు నుంచి భవానిపురం వైపు వెళ్ళు కార్లు ద్విచక్ర వాహనములులో బ్రిడ్జి-> కె.ఆర్.మార్కెట్ -> బి.ఆర్.పి. రోడ్ -> పంజా సెంటర్ -> వి.జి.చౌక్ చిట్టినగర్-> సొరంగం -> సితారా ->గొల్లపూడి బై పాస్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది.
01.10.2022 రాత్రి 11.00 గంటల నుంచి 02.10.2022 రాత్రి 11.00 గంటల వరకు తాడేపల్లి వైపు నుంచి ప్రకాశం బ్యారేజి మీదకు, సీతమ్మవారి పాదాల వైపు నుంచి ప్రకాశం బ్యారేజి -> పి.ఎస్.ఆర్ విగ్రహం -> ఘాట్ రోడ్ -> కుమ్మరిపాలెం వరకు, కనక దుర్గా ఫ్లైఒవర్ మీదుగా ఎటువంటి వాహనములు అనుమతించరు.
01.10.2022 రాత్రి 11.00 గంటల నుంచి 02.10.2022 రాత్రి 11.00 గంటల వరకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపునకు భారీ, మధ్య తరహా రవాణా వాహానాల రాకపోకల మళ్లిస్తున్నారు. ఇబ్రహీంపట్నం వద్ద నుంచి జి కొండూరు – మైలవరం- నూజివీడు -హనుమాన్ జంక్షన్ వైపుకు మళ్ళించారు.
విశాఖపట్నం నుంచి చెన్నై, చెన్నై నుంచి విశాఖపట్నం వైపునకు వెళ్లే భారీ, మధ్యతరహా రవాణా వాహానాలను ఇలా మళ్లించారు.:
1. హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ – పామర్రు - అవనిగడ్డ – రేపల్లె- బాపట్ల – చీరాల - త్రోవగుంట – ఒంగోలు జిల్లా మీదుగా మళ్ళించారు (ఇరువైపులా).
2. గుంటూరు నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి గుంటూరు వైపుకు వెళ్లే భారీ, మధ్యతరహా రవాణా వాహానముల రాకపోకలను బుడంపాడు వద్ద, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్ , పెనుమూడి బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్ళించారు. (ఇరువైపులా)
4. చెన్నై నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి చెన్నై వైపునకు వెళ్లే వాహనాలను మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ళు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి మీదుగా మళ్లించారు.
దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనములను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశంలో మాత్రమే పార్క్ చేయాల్సి ఉంటుంది. భక్తులు వారి వాహనములను ఇతర ప్రాంతములలో పార్క్ చేస్తే పోలీసులు వాటిని లిఫ్ట్ చేస్తారు.