ఇన్ని రోజులు ఎన్నికల ఘర్షణలతో అల్లాడిపోయిన పల్నాడు వాసులకు మరో కష్టం వచ్చి పడింది. ఎక్కడో ఉత్తరాదిలో అరుదుగా కనిపించే వ్యాధి ఇప్పుడు పల్నాడులో వెలుగులోకి రావడం అందర్నీ కలవర పెడుతోంది. అధికారులను, తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందీ రోగం 


ఇప్పుడు పల్నాడు పట్టిపీడిస్తున్న వ్యాధి సికిల్‌ హిమోగ్లోబిన్ డి- పంజాబ్‌. పంజాబ్‌లో మాత్రమే కనిపించే ఈ ఉరుదైన రోగం ఇప్పుడు పల్నాడు జిల్లాలోని ఇద్దరు చిన్నారులకు సోకింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో  జరిపిన పరీక్షల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడినట్టు సూపరింటెండెంట్‌ కిరణ్ తెలిపారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడుకు సమీపంలో ఉన్న తండాలోని చిన్నారులుకు సికిల్‌ హిమోగ్లోబిన్ డి- పంజాబ్‌ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. 


ఎనీమియాతో బాధపడుతున్న చిన్నారులను ఈ మధ్య కాలంలోనే ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారికి గుంటూరు మెడికల్ కాలేజీలో పరీక్షలు చేస్తే సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్‌ అనే వ్యాధి ఉన్నట్టు నిర్దారణ అయింది. ఈ వ్యాధి సోకిన వారికి రెడ్‌ బ్లడ్ సెల్స్‌  తగ్గిపోతాయని అన్నారు. ఎముక మజ్జ మార్చడమే దీనికి పరిష్కారమని వైద్యులు చెబుతున్నారు. 


ఈ లక్షణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డ ప్రాంతంలోని అందరి చిన్నారులకు రక్త పరీక్షలు తప్పసరిగా చేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకు తాత్కాలికంగా రెడ్‌బ్లడ్‌ సెల్స్ ఎక్కించడంతో ఉపశమనం కలుగుతుందని కానీ... ఎముక మజ్జ మార్చడంతో పూర్తిగా నయం అవుతుందని అంటున్నారు. ఇలాంటి చికిత్స విధానం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో లేదని వైద్యులు వెల్లడించారు. 


ఏంటీ వ్యాధి?
సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్‌ను హిమోగ్లోబిన్ D (Hb D) అని కూడా పిలుస్తారు. ఇది. ఇండియా, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్‌లాంటి దేశాల్లో ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. మన దేశంలో మాత్రం వాయువ్య రాష్ట్రాల్లో చిన్నారులకు సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వారు త్వరగా 
అలసిపోతారు. బలహీనంగా కనిపిస్తారు. తరచూ రోగాలు చుట్టుముడుతుంటాయి.