Krishna District Latest News: కరోనా మహమ్మారి టైంలో జరిగిన నష్టం ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అప్పుల బాధతో కుటుంబం గడవడమే కష్టంగా మారిన తర్వాత ఆ ఇంటి పెద్ద ప్రాణాలు తీసుకున్నాడు. తనతోపాటు కొడుకునూ తీసుకెళ్లిపోయాడు. దీంతో తల్లీ కూతుళ్లు అనాథులుగా మిగిలారు.  

Continues below advertisement


కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో జరిగిన ఓ ఘటన స్థానికంగా అందరికీ కంట తడి పెట్టించింది. బంగారు ఆభరణాల తయారీ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. తనతోపాటు కుమారిడిని కూడా తీసుకెళ్లిపోయాడు. అభం శుభం తెలియని కుమారుడికి సైనైడ్ కలిపిన ఐస్‌క్రీమ్ ఇచ్చి ప్రాణాలు తీశాడు. అదే తను కూడా తినేశాడు. 


33 ఏళ్ల వేమిరెడ్డి సాయిప్రకాష్‌రెడ్డి భార్య లక్ష్మీభవానితో కలిసి యనమలకుదురులో ఉంటున్నాడు. ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. కుమార్తె పేరు తక్షిత, కుమారుడు తక్షిత్‌. సాయిప్రకాష్‌ విజయవాడలోని పాతబస్తీలో బంగారం వ్యాపారం చేస్తున్నాడు. ఆభరణాలు తయారు చేసి ఇస్తుంటాడు. అయితే కరోనా టైంలో ఈ వ్యాపారం పూర్తిగా కుదేలైపోయింది. 


కరోనా టైంలో మొదలైన డౌన్‌ఫాల్‌ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ ఈ కుటుంబం ఆర్థిక స్థితిలో మాత్రం ఏ మార్పు కూడా రాలేదు. ఈ దెబ్బకు భార్య కూడా పని చేయాల్సి వచ్చింది. ఆమె స్థానికంగా ఉండే ఓ మందుల దుకాణంలో పని చేస్తోంది. ఇద్దరూ పని చేస్తున్నప్పటికీ కుటుంబం గడవడం కష్టమైపోయింది. 


కరోనా టైంలో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతూ వచ్చాయి. అప్పుల వాళ్లు అడగడం ప్రారంభించారు. బంధువుల సహాయంతో కొంత వరకు తీర్చినప్పటికీ ఇంకా అప్పులు ఉండనే ఉన్నాయి. దీంతో ఆయన మానసికంగా బాగా కుంగిపోయాడు. భార్య, బంధువులు ధైర్యం చెప్పినప్పటికీ కోలుకోలేకపోయాడు. 


రెండు రోజుల క్రితం భార్య షాప్‌నకు వెళ్లింది. కుమార్తె స్కూల్‌కు వెళ్లింది. ఇంట్లో తండ్రీ కొడుకు ఉన్నారు. దీంతో బతుకుపై భయంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు సాయిప్రకాష్. అందుకే పిల్లాడికి ఐస్‌క్రీమ్ తిందామని చెపి బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరూ ఐస్‌క్రీమ్‌లు కొనుక్కొని వచ్చారు. 


ఇంటికి రాగానే బంగారు ఆభరణాల తయారీ కోసం ఉంచిన సైనైడ్‌ను ఐస్‌క్రీమ్‌లో కలిపేశాడు. అందులో ఏం ఉందో తెలియని కుమారుడు దాన్ని తినేశాడు. తను తిన్న ఐస్‌క్రీమ్‌లో కూడా సైనైడ్ కలుపుకున్నాడు సాయిప్రకాష్. సైనైడ్‌తో కలిసిన ఐస్‌క్రీమ్‌ను తిన్న తండ్రీ కుమారుడు అపస్మారక స్థితిలో ఇంట్లో పడిపోయారు. విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన కుటుంబ సభ్యులు వారిద్దర్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు. 


చనిపోక ముందు సైనైడ్ కలిసిన ఐస్‌క్రీమ్‌ తిన్న తర్వాత తన ఫ్రెండ్‌కు సాయి ప్రకాష్‌ మెసేజ్ చేశాడు. సారీబావా చనిపోతున్నాను అని చెప్పాడు. సైనైడ్ తిన్నట్టు కూడా వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దీన్ని అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సాయిప్రకాష్‌ మృతితో తల్లీకూతుళ్లు అనాథులుగా మిలిగిపోయారని స్థానికులు అంటున్నారు. చాలా కాలంగా దిగాలుగా ఉండేవాడని ఏమని అంటే ఏం చెప్పేవాడు కాదని అంటున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.