AP Inter Results 2025 on WhatsApp: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా కొత్త విధానంలో కూడా ఫలితాలు విడుదల చేస్తోంది. 95523 00009 వాట్సాప్‌ నెంబర్‌లో ఏదో రూపంలో మీరు పలకరిస్తే చాలు. సాధారణంగా హాయ్, హలో అనో లేదా ఇంకా ఏదైనా లెటర్‌ టైప్ చేసినా మీకు రిప్లై వస్తుంది. దాని ద్వారా మీరు ఇంటర్‌ ఫలితాలను తెలుసుకోవచ్చు. 

మన మిత్ర పేరుతో ఆంధ్రప్రదేస్ ప్రభుత్వం 95523 00009 వాట్సాప్ నెంబర్‌ ద్వారా 250కిపైగా సేవలు అందిస్తోంది. కరెంటు బిల్‌ నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్ వరకు చాలా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్‌ ఫలితాలను కూడా ఇందులో ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు మీరు ముందుగా ఈ నెంబర్‌ను సేవ్ చేసి పెట్టుకోవాలి. 

నెంబర్‌ సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత... వాట్సాప్‌ నుంచి ఆ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు క్షణాల్లో రిప్లై వస్తుంది. ప్రభుత్వం సింబల్‌తో మనం మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌... "ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం. ప్రజల చేతిలో ప్రభుత్వం. మీకు అవసరమైన వివిధ పౌర సేవలకు సులంభంగా, మర్థవంతంగా సేవలను అందించేందుకు నిబద్దదతో ఉన్నాం. దయచేసి మీకు కావాల్సిన పౌర సేవను ఎంచుకోండి" అనే మెసేజ్ కనిపిస్తుంది. దాని కింద సేవను ఎంచుకోండి అనే మెసేజ్ ఉంటుంది. 

ఇంటర్‌ ఫలితాలను మన మిత్ర యాప్‌లో ఎలా తెలుసుకోవాలి?

ఇక్కడ ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో కూడా ఆ సమాచారన్ని పొంద వచ్చు. అందరికీ అర్థమయ్యేందుకు మేం ఇక్కడ తెలుగులో ఏం ఉంటుందో మాత్రమే చెబుతాం. సేవను ఎంచుకోండి అనే ప్రాంతంలో క్లిక్ చేస్తే మరో పాపప్‌ ఓపెన్ అవుతుంది. అందుకే దయచేసి ఒక సేవను ఎంచుకోమని అడుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే ఈ మన మిత్రలో లభించే సేవల పట్టిక కనిపిస్తుంది. 

ఇంటర్ ఫలితాలు తెలుసుకోవాడనికి ప్రోసెస్‌ ఇదే 

ఈ సేవల పట్టికలో టీటీడీ దేవాలయ సేవల నుంచి పోలీస్‌ శాఖ సేవలు  మొత్తం 12 రకాలు ఉంటాయి. అందులో నాల్గోది అయిన విద్య సేవలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే సెలెక్ట్ హాల్‌టికెట్‌, సెలెక్ట్‌ రిజల్ట్స్‌ రెండు కనిపిస్తాయి. అందులో రిజల్ట్స్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇంటర్ రిజల్ట్స్‌ సెలెక్ట్ చేస్తే మీ హాల్‌టికెట్ నెంబర్ టైప్ చేయాలి. పుట్టిన తేదీ కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నిర్దారించమని అడుగుతుంది. అలా మీరు నిర్దారించిన తర్వాత మీ ఫలితం సెబ్జెక్టుల వారిగా వచ్చేస్తుంది. దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒరిజినల్‌ సర్టిఫికేట్ కాలేజికి వచ్చే వరకు దీన్ని వాడుకోవచ్చు. ఉన్నత విద్య ప్రవేశాలకు కూడా దీన్ని వాడుకోవచ్చు. 

ప్రభుత్వ సేవలు అందుకోవడంలో ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు సర్కారు ఈ వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో బస్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయవచ్చు, దేవాలయాలకు వెళ్లే వాళ్లు టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేసుకునే వెసులుబాటు తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోంది.