48 సంవ‌త్స‌రాలు కష్టపడి కూడ బెట్టిన తన ఆస్తి మెత్తాన్ని దానం చేశారు గుంటూరుకు చెందిన మ‌హిళ‌. ఆమె వృత్తి రీత్యా  వైద్యురాలు. వార‌సులు లేక‌పోవ‌టం, భర్త మూడేళ్ల కిందట మృతి చెందటంతో డాక్టర్‌ ఉమ గవిని తన ఆస్తిని  గుంటూరు ప్ర‌భుత్వాసుప‌త్రికి దానం చేయాల‌ని డిసైడ్ అయ్యారు.


ఇక్క‌డ ట్విస్ట్ ఎంటంటే ఆమె చేతిలో చిల్లి గ‌వ్వ‌కూడ మిగుల్చుకోకుండా మెత్తం సంపద‌ను దానం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు ఉమ. మొత్తం రూ.20 కోట్ల ఆస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఉమా ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలి్‌స్టగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో 1965 సంవ‌త్స‌రంలో మెడిసిన్ విద్య‌ను అభ్య‌సించారు. ఆత‌రువాత ఉన్నత విద్య పూర్తి చేసి 45సంవ‌త్స‌రాల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడిపోయారు. 


ఇటీవ‌ల‌ డల్లాస్‌లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ  సమావేశాల్లో పాల్గోన్న‌ ఉమ, తాను మెడిసిన్‌ చేసిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెల్ల‌డించారు. ఆస్తిలో కొంత వాట‌ను దానం చేయ‌టం అమెరికాలో ప‌రిపాటిగా జ‌రుగుతుంటుంది కాని తన మెత్తం ఆస్తిని కూడ ఉమ ఉదారంగా దానం చేశారు. చేతి ఖ‌ర్చుల‌కు కూడ దాచుకోకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్థి మొత్తాన్ని ఆమె ఆసుప‌త్రికి ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. 


ఉమా 2008లో ‘జింకానా’ అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు తెల‌పారు. ఇందుకు ఆమె నిరాక‌రించ‌టంతో,  ఉమ భర్త.. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరు ఈ బ్లాక్‌కు పెట్టాలని నిర్ణయించారు. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్‌ చేసి, ఎన‌స్టీషియ‌న్ గా విధులు నిర్వ‌ర్తించి, మూడేళ్ల కిందట ఆయన మృతి చెందారు. 


మిగిలిన వారు కూడ త‌మ వంతు గా...
జింకానా రీ యూనియన్‌ సమావేశాల్లో డాక్టర్‌ ఉమ అందించిన స్ఫూర్తితో ఇతర వైద్యులు కూడ త‌మ వంతుగా స‌హ‌కారాన్ని అందించేందుకు ముందుకు వ‌చ్చారు. డాక్టర్‌ మొవ్వా వెంకటేశ్వర్లు తన వంతుగా రూ.20 కోట్లు ,డాక్టర్‌ సూరపనేని కృష్ణప్రసాద్‌, షీలా దంపతులు రూ.8 కోట్లు, తేళ్ల నళిని, వెంకట్‌ దంపతులు రూ.8 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. మరి కొంతమంది పూర్వ విద్యార్థులు కూడా విరాళాలు అందించేందుకు సుముఖత వ్య‌క్తం చేశారు.