Lokesh Apologies: విజయవాడ ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై వెలిసిన దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు అక్కడి సౌకర్యాలపై తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.కనీసం ప్రసాదాల కౌంటర్ వద్ద తాగేందుకు మంచినీరు(Drinking Water) కూడా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రసాదం కౌంటర్ వద్ద నిర్వహణ కూడా సరిగా లేదని...అసలు ఈ గుడికి ఈవో ఉన్నాడా..? లేడా అంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నించారు.  ఇదే విషయాన్ని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌(Lokesh)ను ఎక్స్‌లో ట్యాగ్‌ చేస్తూ...కూటమి ప్రభుత్వం హయాంలో ఈ విధమైన సేవలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల అమ్మవారి భక్తులకు ఇబ్బంది కలగడంతోపాటు ప్రభుత్వంపైనా  తీవ్ర విమర్శలు వస్తున్నాయంటూ  లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.ఆయనతోపాటు సీఎం చంద్రబాబు(Chandra Babu),డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ‌్‌(Pawan Kalyan)ను కూడా ట్యాగ్ చేశారు.

Continues below advertisement


Also Read: ఇంకా ఎన్నేళ్లు విచారిస్తారు- 3 వారాల్లో తేల్చేయండి- అధికారులపై పవన్ సీరియస్


ఎక్స్‌లో భక్తుల ఫిర్యాదుపై తక్షణం స్పందించిన ఐటీశాఖ మంత్రి నారాలోకేశ్‌....సంబంధిత అధికారుల దృష్టికి ఈవిషయం తీసుకెళ్లామని...వెంటనే ఆ సమస్య పరిష్కరించామని తెలిపారు.భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామంటూ...భక్తులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ  ఆయన క్షమాపణలు కోరారు. ఇకపై దుర్గగుడిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 
   
ఇటీవల తిరుపతి (Tirupathi)తొక్కిసలాట ఘటనలో  భక్తులు మృతిచెందడంతో డిప్యూటీ సీఎం  పవన్‌కల్యాణ్(Pawan Kalyan) బహిరంగ క్షమాపణలు చెప్పారు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైనందున బేషరతుగా క్షమాపణలు కోరుతున్నానని అందరికీ ఆదర్శంగా నిలిచారు.ఇప్పుడు అదే బాటలో మంత్రి నారాలోకేశ్  సైతం  భక్తులకు క్షమాపణలు చెప్పి  ఉదారతను చాటుకున్నారు. నిజానికి దేవదాయశాఖ తన పరిధిలోది కాకపోయినా...లోకేశ్‌ (Nara Lokesh)సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతోపాటు  భక్తులకు క్షమాపణలు చెప్పడంపై  అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల బాధితులకు కొంత ఊరట, ఉపశమనం కలుగుతుందని అంటున్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా  తప్పు జరిగినప్పుడు  ఒప్పుకోవడం మంచి పరిణామం.  


Also Read: ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !