Vijayawada Chicken Dum Biryani: బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. బిర్యానీ పేరుచెప్తే... నోరూరని నాన్‌వెజ్‌ ప్రియులు ఉండరు. అందులోనూ చికెన్‌ ధమ్‌ బిర్యానీ (Chicken Dham Biryani) అంటే పడి చచ్చిపోతారు. ఆహా ఏం రుచి అంటూ... ఫుల్లుగా లాగించేస్తారు. ఆ టేస్ట్‌కి ఫిదా అయిపోతారు. సాధారణంగా బిర్యానీకి పెట్టింది పేరు హైదరాబాద్‌ అంటారు. కానీ ఇప్పుడు... ఆ లిస్టులో విజయవాడ (Vijayawada) కూడా చేరిపోయింది. బెజవాడ వాసులు కూడా బిర్యానీపై మక్కువ చూపుతున్నారు. చికెన్‌ దమ్‌ బిర్యానీపై మనసు పారేసుకున్నారు. అందుకే... ఆన్‌లైన్‌ ఆర్డర్లలోనూ.... దమ్‌ బిర్యానీ ఈజ్‌ ద బెస్ట అనిపించేశారు విజయవాడ వాసులు.


బిర్యానీ అంటే ధమ్‌బిర్యానీనే... అనేస్తున్నారు బెజవాడ ప్రజలు. ఈ ఏడాది స్విగ్గీ ఇండియా(Swiggy India) ఇచ్చిన నివేదిక ప్రకారం... చికెన్‌ దమ్‌ బిర్యానీ బెజవాడ ప్రజలు మనసు దోచుకుంది. చికెట్‌ బిర్యానీ అంటే తమకు మహా ఇష్టమని వారు చెప్పకనే చెప్పేశారు. ఈ ఏడాది ఆర్డర్లలో చికెన్‌ ధమ్‌ బిర్యానీనే టాప్‌ ప్లేస్‌లో ఉండమే ఇందుకు నిదర్శనమని నిరూపిస్తోంది స్విగ్గీ ఆన్‌లైన్‌ ఆర్డర్ల(Online orders) లిస్ట్‌. 


స్విగ్గీ ఇండియాలో... 2023 జనవరి ఒకటో తేదీ నుంచి నవంబర్‌ 15 వరకు జరిగిన ఫుడ్‌ ఆర్డర్ల లిస్టు ప్రకారం... విజయవాడ ప్రజలు... అత్యధికంగా ఆర్డర్‌ ఇచ్చింది చికెన్‌ ధమ్‌  బిర్యానీ అని తేలిపోయింది. వీకెండ్‌ పార్టీలు, ఫంక్షన్లు, గెట్‌ టు గెదర్లు, ఫ్యామిలీ పార్టీలు, బర్త్‌డే ఫంక్షన్లు.... ఏదైనా సరే.. వుయ్‌ వాంట్‌ చికెన్‌ దమ్‌ బిర్యానీ అంటూ తెగ ఆర్డర్లు  ఇచ్చేశారట విజయవాడ ప్రజలు. నలుగురు కలిస్తే చికెన్‌ ధమ్‌ బిర్యానీ లాగించాల్సిందే అన్నంతగా... ఇష్టం చూపించారట. అందుకే విజయవాడకు సంబంధించిన ఆన్‌లైన్‌  ఆర్డర్లలో చికెన్‌ దమ్‌ బిర్యానీ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచిందని స్విగ్గీ ఇండియా రిపోర్ట్‌ తేల్చేసింది


దేశంలోనే ఆన్‌లైన్‌ ఆన్‌ డిమాండ్‌ ప్లాట్‌ఫామ్‌లో స్విగ్గీ ఇండియా ఒకటి. ఈ కంపెనీ ఇచ్చిన డిన్నర్‌ టైమ్‌ ఫుడ్‌ డెలవిరీల(delivery) లో... చికెన్‌ ధమ్‌ బిర్యానీదే అగ్రస్థానమని లెక్కుల   చెప్తున్నాయి. 2023కు సంబంధించిన ఈ ఏడాదిలో... ఒక వినియోగదారుడు రూ.15వేల 339 విలువైన ఆర్డర్‌ను ఇచ్చాడని ఆ సంస్థ స్పష్టం చేసింది. దీన్ని బట్టి..  విజయవాడ  ప్రజలకు చికెన్‌ దమ్‌ బిర్యానీ ఎంతగా నచ్చేసిందో... మాటల్లో చెప్పనక్కర్లేదు. స్విగ్గీ ఇండియా  ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం... విజయవాడలో అత్యధికంగా ఆర్డర్‌ చేసిన టాప్‌-5లో  ఫుడ్‌ ఐటెమ్స్‌లో... మొదటి స్థానం చికెన్‌ ధమ్‌ బిర్యానీ అని తేలిపోయింది. ఇక, రెండో స్థానంలో ఇడ్లీ  (Idli) సొంతం చేసుకుంది. ఆపై... మూడో స్థానంలో చికెన్‌ ఫ్రైబిర్యానీ (Chicken Fry Biryani) ఉంది.  డిజర్ట్స్‌ విషయానికి వస్తే... చాకో లావా కేక్‌(Choco Lava Cake), జీడిపప్పు బర్ఫీ(Cashew Barfi), రసమలై(Rasamalai), బాదం పాల(Almond milk)ను ఎక్కువగా ఆర్డర్‌ చేశారట బెడవాడ నగరవాసులు. స్నాక్స్‌లో అయితే... హాట్‌ అండ్‌  క్రిస్పీ చికెన్‌(Hot and crispy chicken), మైసూర్‌ బజ్జీ(Mysore Bajji), పొటాటో మసాలా పూరీ(Potato masala puris)లను ఆర్డర్‌ చేసినట్టు స్విగ్గీ ఇండియా తెలిపింది.


Also Read: హైదరాబాద్‌లో 30 శాతం ఆదాయం ఇంటి ఈఎంఐకే - భాగ్యనగరంలో జాగా కొనాలంటే చుక్కలే!


Also Read: కళ్యాణ్ రామ్ సినిమాకు కలెక్షన్లు తగ్గాయి, ఆ కామెంట్స్ ఫలితమేనా?