Chandrababu participated in Chandi Yagam : తెలుగుదేశం పార్టీ (Telugudesam Party ) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu ) ఉండవల్లి (Undavalli )లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భార్య భువనేశ్వరి (Bhuvaneswari)తో కలిసి చండీయాగం ( Chandi Yagam), సుదర్శన నారసింహ హోమం ( Sudarshana narasimha Homam ) నిర్వహించారు. 3 రోజుల పాటు జరగనున్న యాగక్రతువులో తొలి రోజు వివిధ యజ్ఞాలు చేశారు.
చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో గుంటూరుకు చెందిన వేదపండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో 40మంది రుత్వికులు, ప్రత్యేక పూజలు చేయించారు. శనివారం, ఆదివారం కూడా యాగం, హోమం కొనసాగనుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రులు నారాయణ, దేవినేని ఉమా, రవీంద్రబాబు, కన్నా లక్ష్మినారాయణ, నెట్టెం రఘురాం, అలపాటి రాజా, బోండా ఉమా, తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టయి, జైలు నుంచి విడుదలైన చంద్రబాబు...వరుసగా దేవాలయాలను సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామి, బెజవాడ దుర్గమ్మ, సింహాచలం అప్పన్న స్వామి వారిని దర్శించుకున్నారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుండటంతో ముందుగానే ఆలయాల బాట పట్టారు. నోటిఫికేషన్ వస్తే ప్రచారం, వ్యూహాల్లో మునిగిపోవాల్సి ఉండటంతో ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు.