AP Police officers Association donation to AP CM Relief Fund | విజయవాడ: వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. కొందరు ఇదివరకే సీఎం చంద్రబాబును కలిసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించారు. ఈ క్రమంలో ఏపీ పోలీసు అధికారుల సంఘం సీఎం సహాయనిధికి భారీ విరాళం అందించింది. వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ పోలీసులు తమ వంతుగా రూ.11,12,50,000 (11 కోట్ల 12 లక్షల 50 వేల రూపాయలు) విరాళం ఇచ్చారు.


ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఆదివారం నాడు సీఎం చంద్రబాబును కలిసి విరాళం చెక్కును అందించారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంజెలిజెన్స్ అడిషనల్ డీజీపీ, ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఉన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకుగానూ విరాళాలు అందించాలని సీఎం చంద్రబాబు పిలుపుమేరకు సినీ సెలబ్రిటీలు, వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు తమకు తోచిన సాయం చేస్తున్నారు. అన్నింటిలో పోలీస్ అధికారుల సంఘం ఇచ్చిన విరాళమే ఇప్పటివరకూ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అతిపెద్ద డొనేషన్ అని తెలుస్తోంది.


తాజాగా విరాళాలు ఇచ్చింది వీరే..
వరద బాధితులను ఆదుకునేందుకు దీపక్ నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీ సుబ్రహ్మణ్యం రూ.1 కోటి విరాళం అందించారు. వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ.50 లక్షలు విరాళం ఇచ్చింది. వై.రాజారావు రూ.10 లక్షలు, సాంబశివరావు రూ.5 లక్షలు, సీటీ చౌదరి రూ.2.55 లక్షలు, శ్రీ కోవిల్ ఫ్లాట్స్ ఒనర్స్ రెసిడెంట్ అసోసియేషన్ రూ.2.21 లక్షలు, ఎమ్.శ్రీనివాసరావు రూ.2లక్షలు, వెలగపూడి సత్యనారాయణ రూ.2 లక్షలు, పువ్వాడ రామకృష్ణ రూ.2 లక్షలు ఏపీ సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన అందరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.



 


AP DGP Dwaraka Tirumala Rao donated Rs. 11.12cr to the CMRF to support Flood victims. Addl DGP Intelligence, IGP L&O & Police officers Association President were present on this occasion.