Andhra Pradesh News: సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్న టైంలో ఓ వ్యక్తి కలకలం రేపాడు. గన్నవరం ఏయిర్‌పోర్టులో జగన్ ఉండగానే అనుమానాస్పద స్థితిలో ఓ ఆ వ్యక్తి తిరుగుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. 


జగన్ మోహన్ రెడ్డి తన ఫ్యామిలీతో లండన్ టూర్‌ వెళ్లారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. దీని కోసం గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన జగన్‌కు పార్టీ నేతలు పుష్పగుచ్చాలు ఇచ్చి హ్యాపీ జర్నీ చెప్పారు. 


నేతలు వచ్చిన టైంలో అక్కడ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. సెక్యూరిటీ సిబ్బందికి డౌట్ వచ్చి వివరాలు సేకరించారు. అయితే ఆయన ఎన్‌ఆర్‌గా గుర్తించారు. అదపులోకి తీసుకొని విచారిస్తే మరింత అనుమానం కలిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 


జగన్ టూర్‌లో అనుమానాస్పదంగా తిరగిన వ్యక్తి పేరు తుళ్లూరు లోకేష్‌. ఆయన అమెరికాలోని వాషింగ్టన్‌లో వైద్యుడు. ఆయనకు అమెరికా సిటిజన్‌షిప్‌ కూడా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకొని విచారిస్తే జగన్ విదేశీ టూర్‌పై మెసేజ్‌లు ఉన్నాయి. వేరే వాళ్లతో చాటింగ్ చేసిన వివరాలు ఉన్నాయి. 


వాటన్నింటిని చూసిన పోలీసులు లోకేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. లోతుగా ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ టైంలో ఆయన అనారోగ్యానికి గురయ్యాయి. తనకు చాతీలో నొప్పి వస్తుందని చెప్పారు. దీంతో లోకేష్‌ను హుటాహటిని ఆసుపత్రికి తరలించారు.