AP Governments Shakatam : రిపబ్లిక్ డే వేడుకల్లో (Republic Day celebrations) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన శకటానికి మూడో స్థానం లభించింది. డిజిటల్ విద్యా బోధన (Digital Education), నాడు-నేడు (Nadu-Nedu), ఆంగ్ల మాధ్యమం (English Medium) లో బోధన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని తయారు చేసింది. వికసిత భారత్ లో భాగంగా రూపొందించిన శకటాలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరించారు. ఇందులో ఏపీ శకటానికి మూడో స్థానం దక్కింది. జనవరి 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఆన్ లైన్ ఓటింగ్ లో ఏపీ శకటం మూడోస్థానంలో నిలిచింది. మొదటి  స్థానంలో గుజరాత్, ఒడిషా ప్రభుత్వాలు రూపొందించిన శకటాలు నిలిచాయి. మంగళవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్ అవార్డు అందుకోనున్నారు.


26న కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా ఏపీ శకటాన్ని ప్రదర్శించారు. ఏపీలో 62వేల డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల‌తో బోధన అందిచడం ద్వారా ఏపీ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ స్థాయి విద్యా బోధన అందించేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన శకటం జనవరి 26న ఏపీ తరఫున గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు అద్దం పట్టేలా శకటాన్ని రూపొందించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న ఒడిశా, గుజరాత్  శకటాలకు మొదటిస్థానం దక్కింది. ఒడిశా శకటంలో మహిళా సాధికారతపై సందేశాలతో రఘురాజ్‌పూర్ వారసత్వ హస్తకళల గ్రామం నమూనాను ప్రదర్శించారు. పీపుల్స్ చాయిస్ కేటగిరీలో ఒడిశాతో పాటు గుజరాత్‌కు చెందిన శకటం మొదటి బహుమతిని గెలుచుకుంది.