Vijayawada Crime News: విజయవాడలో దారుణం జరిగింది. శ్రీజ ఆసుపత్రి యజమాని, ఆర్థోపెడిక్‌ డాక్టర్‌గా శ్రీనివాస్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 


విజయవాడలోని గురునానక్‌ నగర్‌లో శ్రీనివాస్‌ కుటుంబంలోని ఐదుగురు మృత్యువాత పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు, డాక్టర్‌ శ్రీనివాస్ దంపతులు, ఓ వృద్దురాలు కూడా ఉన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.