Mla Perni Nani : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. చిరంజీవి, పవన్ కు అసలు పొంతనే లేదని ఆయన అన్నారు. సొంత అన్నకు వెన్నుపోటు పోచిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని పేర్ని నాని ఆరోపణలు చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచారని గుర్తు చేశారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ మాట్లాడుతున్నారని, తాను తప్పుచేయనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. రాజకీయాల్లో పవన్ చేసినన్నీ తప్పులు చిరంజీవి చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.
చిరంజీవికి వెన్నుపోటు
ప్రజారాజ్యం పార్టీ ఓడిపోగానే యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మళ్లీ ఎక్కడా కనిపించలేదని పేర్నినాని ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీని పవన్ ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. విజయవాడలో పేర్నినాని ఆదివారం మీడియా మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. చిరంజీవి దయతో పవన్ ఈ స్థాయికి వచ్చారన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ గతంలో మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయన్నారు. 2009లో చంద్రబాబును తప్పుబట్టి 2014లో పవన్ టీడీపీ ఓటు వేయమని ప్రజల్ని కోరారన్నారు. సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేయడం తప్ప చంద్రబాబు గురించి ఒక్కరోజు కూడా పవన్ ప్రశ్నించలేదని మండిపడ్డారు. వారాంతపు ప్రజానాయకుడు పవన్ కల్యాణ్ ఇంకా భ్రమలో ఉన్నారని నాని ఆరోపించారు. చిరంజీవి దయతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్, సొంత అన్నకు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
పవన్ వ్యాఖ్యలకు కౌంటర్
జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ అవలంభించిన విధానాలపై పవన్ కల్యాణ్ లీగల్ సెల్ సమావేశంలో మాట్లాడారు. మూడు రాజధానులు, వైసీపీ వచ్చే ఎన్నికల్లో వచ్చే సీట్లపై పవన్ స్పందించారు. పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టాలే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సహకారంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ఇవాళ చిరంజీవి తప్పుబడుతున్నట్లు మాట్లాడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు.
పవన్ విమర్శలు
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 47-67 సీట్లు వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మూడు రాజధానుల పేరుతో వివాదం చేస్తున్నారని ఆరోపించారు. నేడు ఏపీకి రాజధాని లేకుండా చేశారన్నారు. చట్ట సభల్లో మాట ఇచ్చి వెనక్కిపోతే ఇక దానికి విలువేముందని ప్రశ్నించారు. వేల ఎకరాలు వద్దు చిన్న రాజధాని చాలని అప్పుడే చెప్పానన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి 30 వేల ఎకరాలు అవసరం అన్నారని గుర్తుచేశారు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని, అమరావతిని అభివృద్ధి చేస్తానన్నారన్నారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మాట తప్పి మోసం చేశారని విమర్శించారు.
Also Read : Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 47-67 సీట్లు, టీడీపీకి గుడ్డిగా మద్దతివ్వలేదు - పవన్ కల్యాణ్
Also Read : Nara Lokesh Padayatra: ఏపీలో లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ - ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతారంటే?