Amaravath News: బ్యాంకుల్లో డబ్బులు, నగదు దాచుకునేదే సురక్షితమని...కంచె చేను మేసిన చందంగా బ్యాంకు సిబ్బందే వినియోగదారులు డబ్బులు దోచేస్తే ఎవరికి చెప్పుకోవాలి.,, ఇక ఎవరి నమ్మాలి...కృష్ణా జిల్లా‍( Krishna Distric) ఓ బ్యాంకు మేనేజర్ చేసిన నిర్వాకం సిబ్బంది చేసిన మోసం బ్యాంకులపైనే నమ్మకం పోయేట్లు చేసింది. స్వగ్రామానికే చెందిన ఓ వ్యక్తిని నమ్మించి బ్యాంకులో నగలు తాకట్టు పెట్టించున్న బ్యాంకు మేనేజర్ (Bank Manager)...డబ్బులు కట్టి నగలు గురించి అడిగితే ఇంటికి రా ఇస్తానంటూ వలపు వల విసిరింది.తీరా ఇంటికి వెళ్లిన తర్వాత పెళ్లి ప్రపోజల్ పెట్టడంతో వినియోగదారుడు అవాక్కాయ్యాడు. ఇంతకి తాకట్టు పెట్టిన బంగారాన్ని అమ్మడు ఏం చేసిందనుకుంటున్నాడు. చక్కగా నడుముకు వడ్డాణం చేయించుకుంది.


బ్యాంకు మేనేజర్ బురిడీ
కృష్ణా జిల్లా గంగూరు యూనియన్ బ్యాంకు (Union Bank) మేనేజర్ పద్మావతికి భర్తతో విభేదాలు కారణంగా ఒంటరిగా ఉంటోంది. స్వగ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్‌లో యూనియన్ బ్యాంకు అకౌంట్‌ ఉండగా...మాయామాటలతో తాను పనిచేసే గంగూరు బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. తన వద్ద బంగారం ఉందని...ఇంటి వద్ద ఉంటే దొంగల భయం ఉందని బ్యాంకు లాకర్‌లో పెడితే సేఫ్‌గా ఉంటుందని లాకర్ ఇప్పించాల్సిందిగా బ్యాంకు మేనేజర్ పద్మావతిని కోరాడు. బంగారం లాకర్‌పెట్టి దాచేకన్నా...కుదవపెట్టి డబ్బులు తీసుకుంటే దేనికైనా ఉపయోగించుకోవచ్చని సలహా ఇచ్చింది.ఆమె చెప్పినట్లే బంగారం(Gold)) బ్యాంకులో పెట్టి రూ.2 లక్షల రుణం తీసుకున్నాడు. తాను తీసుకున్న రుణాన్ని గతేడాది నవంబర్‌లో చెల్లించి నగలు తిరిగి ఇవ్వాలని కోరితే....అప్పటి నుంచి పద్మావతి దాటవేస్తూ వచ్చింది. నెలలు గడుస్తున్నా...బంగారం ఇవ్వకపోవడంతో అతను గట్టిగా నిలదీసే సరికి ఆమె అసలు రంగు బయటపడింది


నగలు తిరిగి ఇవ్వమంటే వలపు వల
బ్యాంకులో తాకట్టు పెట్టిన నగలు తనవద్దే ఉన్నాయని...ఇంటికి వచ్చి తీసుకోవాల్సింది యోగేశ్వరరావును కోరింది. ఆమె చెప్పినట్లే చెప్పిన సమయానికి పద్మావతి ఇంటికి వెళ్లిన యోగీశ్వరరావుకు దిమ్మెతిరిగే షాకిచ్చింది. ఇంటికి వెళ్లిన యోగేశ్వరరావుపై వలపు వల విసిరిన పద్మావతి...తనకు భర్తలేడని పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రపోజలు పెట్టింది. పద్మావతి నుంచి వచ్చిన ఆఫర్‌తో షాక్‌లోకి వెళ్లిన యోగేశ్వరరావు...ఒక్కక్షణంలో తేరుకుని చిన్నగా అక్కడి నుంచి జారుకున్నాడు.


కష్టమర్ నగలతో వడ్డాణం
యోగీశ్వరరావు సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నగలు ఇంంటికి తీసుకెళ్లిన పద్మావతి....380 గ్రామాల బంగారంతో నడుముకు వడ్డాణం చేయించుకుంటోంది. ఇంటికి వచ్చిన యోగేశ్వరరావు ఇదే విషయం చెప్పి...కావాలంటే తనను పెళ్లి చేసుకోమని కోరింది.ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందని గ్రహించిన యోగీశ్వరరావు...పోలీసులను ఆశ్రయించాడు. నగలు కాజేసి అడిగితే పెళ్లి చేసుకోవాలని కోరుతోందని ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పెనమలూరు పోలీసులు...దర్యాప్తు చేస్తున్నారు.గతంలోనూ ఇదే మాదిరిగా కొందరిని మోసం డబ్బులు గుంజినట్లు ఆమెపై కేసులు ఉన్నాయి.


భరోసా లేదు
కస్టమర్లు దాచుకున్న సొమ్ముకు బ్యాంకుల్లో భరోసా దక్కడం లేదు. బ్యాంకు సిబ్బందే మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. ఇటీవలే విజయవాడలో ఓ ప్రైవేట్ ఆర్థిక కార్యకలాపాల కేంద్రంలో పనిచేస్తున్న యువతి ప్రియుడితో కలిసి బ్యాంకులో దాచిన బంగారంతో ఉడాయించింది. దీంతో జనం బ్యాంకుల్లో నగదు, బంగారం ఉంచాలంటేనే బయపడుతున్నారు