ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక నిర్వహణ విషయంలో కొంత కాలంగా వస్తున్న విమర్శలకు తగినట్లుగానే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో అంశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజు శుక్రవారం నాడు కాగ్ రిపోర్టును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక నిర్వహణకు అసలు బడ్జెట్‌కు పోలిక లేదని శాసనసభను లెక్కలోకి తీసుకోకుండా పద్దులు నిర్వహిస్తున్నారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక ఏపీ ప్రభుత్వంపై మండిపడింది. 


Also Read : నాడు సందుల్లో తిరిగి ముద్దులు పెట్టారు..నేడు కంటికి కనిపించడం లేదు .. జగన్‌పై జనసేన సెటైర్లు !


2019-20 ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన అనుబంధ ప‌ద్దుల‌ను ఖ‌ర్చు చేసి.. త‌ర్వాత జూన్ 2020లో శాస‌న స‌భ‌లో ప్రవేశ పెట్టారు ఇది రాజ్యాంగ విరుద్దని కాగ్ ఆక్షేపించింది. ప్రజా వ‌న‌రుల వినియోగ నిర్వహ‌ణ‌లో ఆర్థిక క్రమ‌శిక్షణా రాహిత్యాన్ని ప్రోత్సహించారని కాగ్ తేల్చింది. శాస‌న స‌భ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖ‌ర్చు చేసిన సందర్భాలు పెరిగిపోయాయని తెలిపింది.  


Also Read : అమరావతి మహిళా రైతులకు చీర, సారె.. కోవూరు ప్రజల ఆత్మీయత !


ఇక అద‌న‌పు నిధులు అవసరం అని భావిస్తే శాస‌న స‌భ నుంచి ముంద‌స్తు ఆమోదం పొందేలా చూసుకోవాలని కాగ్ స్పెష్టం చేసింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వివ‌రాల‌ను బ‌డ్జెట్ ప‌త్రాల్లో స‌రిగా చూప‌లేదని కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018-19 ఆర్థిక సంవ‌త్సరంతో పోల్చితే 2019-20లో 3.17 శాతం రెవెన్యూ రాబ‌డులు తగ్గాయని.. కొత్త సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల రెవెన్యూ ఖ‌ర్చులు 6.93 శాతం పెరిగాయని కాగ్ లెక్కించింది. 2018-19 నాటి రెవెన్యూ లోటును మించి 2019-20లో 90.24 శాతం రెవెన్యూ లోటు పెరిగిందని తెలిపింది. 


Also Read : మూడు రాజధానుల చట్టాల్ని ఉపసంహరించుకున్నాం... హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్


2018-19 ఆర్థిక సంవత్సరంతో పొల్చితే 2019-20లో రూ.32,373 కోట్ల మేర బ‌కాయిల చెల్లింపులు పెరిగాయి. చెల్లించాల్సిన బ‌కాయిల వివ‌రాల‌ను బ‌డ్జెట్ ప‌త్రాల్లో స‌రిగా చూప‌లేదని కాగ్ తెలిపింది. ఆఫ్ బడ్జెట్ రుణాలను లెక్కలోకి చెప్పలేదని కాగ్ తెలిపింది. ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో తీసుకుంటున్న రుణాల గురించి శాసనసభకు చెప్పలేదని.. బడ్జెట్‌లో చూపించలేదని వస్తున్న విమర్శల సమయంలో కాగ్ నివేదిక కీలకంగా మారింది. 


Also Read : జగన్‌పై పొగడ్తల విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ తగ్గలే ! మంత్రి పదవుల కోసమేనా ?


Also Read : జగన్‌పై పొగడ్తల విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ తగ్గలే ! మంత్రి పదవుల కోసమేనా ?