Top Telugu Headlines Today 4 August 2023: 
వైసీపీ మేనిఫెస్టోలో 90 శాతం పెండింగ్- మహాశక్తి చైతన్య రథ యాత్రతో మహిళల్లో కదలిక: గంటా శ్రీనివాస్‌రావు
ఎన్నికల సందర్భంగా వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో 90 శాతం హామీలు ఇంకా నెరవేర్చలేదని ఆరోపించారు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు. మహా శక్తి చైతన్య రథ యాత్ర ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నవరత్నాలలో హైలెట్ చేసిన ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. మహిళలు, రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలన్నారు గంటా శ్రీనివాస్ రావు. నేడు ప్రారంభమైన మహాశక్తి చైతన్య రథ యాత్ర నలభై రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతుందని అన్నారు. ఈ యాత్రతో మహిళల్లో చైతన్యం వస్తుందని తెలిపారు. ఆ దిశగానే ఈ యాత్ర సాగుతుందని వివరించారు.   పూర్తి వివరాలు


ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ నెంబర్ వన్ - కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమయిందన్న కేటీఆర్ !
కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఐటీ అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని కేటీఆర్ ప్రకటించారు.  దేశంలో ఉన్న‌ ఐటీ పురోగ‌తితో పోలిస్తే మ‌న ఐటీ పురోగ‌తి నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు… శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఐటీ ఎగుమ‌తుల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్  స‌మాధానం ఇచ్చారు.  హైద‌రాబాద్‌లోని బేగంపేట‌లో 1987లో మొట్ట‌మొద‌ట ఐటీ ట‌వ‌ర్ వ‌చ్చింద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డే వ‌ర‌కు.. 27 సంవ‌త్స‌రాల్లో ఐటీ రంగాల్లో రూ. 56 వేల కోట్లు ఐటీ ఎగుమ‌తులు మాత్ర‌మే న‌ని, కానీ గ‌తేడాది తెలంగాణ ప్ర‌భుత్వం ఐటీ రంగంలో రూ. 57,707 ఐటీ ఎగుమ‌తులు సాధించింద‌ని పేర్కొన్నారు.  పూర్తి వివరాలు


ఏపీలో మోదీ ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నారా ? ఈసీ హడావుడి దేనికి సంకేతం?
ఏపీలో మోదీ ముందస్తు కోరుకుంటున్నారా...? రిటర్నింగ్ అధాకారుల నియామకం అందుకేనా..? ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణతో పాటే ఎన్నికలకు వెళ్లమని జగన్ కు సూచించారా..? ఏపీలో ముందుగానే ఎలక్షన్ వస్తుందా.. ? ఇప్పుడిదే హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. కానీ ఏపీలోని అన్ని నియోజకవర్గాలకు ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. నవంబర్ -డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సిన తెలంగాణలోనే వారం రోజుల క్రితం రిటర్నింగ్ అధికారులను నియమించారు. కానీ ఎప్పుడో మార్చి, ఏప్రిల్‌లో  జరిగే ఎన్నికలకు అప్పుడే ఆర్వోలను ఎందుకు నియమించారనేది చాలా మందికి వస్తున్న సందేహం.  పూర్తి వివరాలు


టీఎస్‌ ఆర్టీసీ విలీనం బిల్లుపై స్పందించిన గవర్నర్- సమయం కావాలని ప్రభుత్వానికి సమాచారం
న్యాయసలహా తీసుకొని సమస్యలు రాకుండా చూసుకునేందుకు ఆర్టీసీ విలీనం బిల్లు అనుమతికి సమయం కావాలన్నారు గవర్నర్ తమిళిసై. కావాలనే గవర్నర్ ఈ బిల్లుపై స్పందించలేదన్న విమర్శలపై ఆమె స్పందించారు.  పూర్తి వివరాలు