Top Headlines In AP And Telangana: 


1. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈదుపురంలో పర్యటించారు. అక్కడ ఉచిత గ్యాస్‌ పథకాన్ని ప్రారంభించారు. స్టౌవ్ వెలిగించిన చంద్రబాబు పాలు, టీ పొడి, పంచదార వేసి టీ చేశారు. టీ తయారీకి అవసరమైన వస్తువులు అందివ్వడంలో అక్కడి వారు కాస్త కంగారుపడుతుంటే కూల్‌గా ఉండాలని తాను వచ్చాననే టెన్షన్ వద్దంటూ చెప్పుకొచ్చారు. టీ మరిగిస్తూనే శాంతమ్మతో మాట్లాడి సీఎం చంద్రబాబు... కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా చదవండి.


2. రెడ్ బుక్‌పై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు


విదేశాల్లో ఉండే భారతీయులను అంతా ఎన్‌ఆర్‌ఐలు అంటారని... ఇకపై వారిని ఎంఆర్‌ఐలుగా పిలుస్తానన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్‌. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆయన టీడీపీ కార్యకర్తలు, నేతలు, తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఐలను ఇకపై మోస్ట్ రిలయబుల్‌ ఇండియన్స్‌గా అంటే ఎంఆర్‌ఐలుగా అభివర్ణించారు లోకేష్‌. ఉన్నత చదువులు చదివి రెండు సూట్‌ కేసులు పట్టుకొని చాలా మంది అమెరికా వచ్చారని... కానీ వారి మనసు ఎప్పడూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటుదని అభిప్రాయపడ్డారు. ఆలోచన ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ గురించే ఉంటుందన్నారు. చిటిక వేస్తే వచ్చి సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. ఇంకా చదవండి.


3. తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర


బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు అభ్యర్థన మేరకు సమీప భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కెటిఅర్ ప్రకటించారు. దీపావళిరోజున సోషల్ మీడియోలో నెటిజన్లతో ఇంట్రాక్ట్ అయ్యారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ టైంలోనే పాదయాత్ర ప్రస్తావన వచ్చినప్పుడు తాను చేయబోతున్నట్టు వెల్లడించారు. దీపావళి రోజున నెటిజన్లతో కేటీఆర్ ఇంట్రాక్ట్ అయ్యారు. దాదారు గంటన్నర పాటు సాగిందీ లైవ్ డిస్కషన్. రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాలు, సినిమాలు ఇలా చాలా అంశాలపై అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. ఇంకా చదవండి.


4. బ్యాంక్ వినియోగదారులకు బిగ్ అలర్ట్


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్‌ 2024 కోసం బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆ లిస్ట్‌ ప్రకారం, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులు ఈ నెలలో 12 రోజులు మూతబడతాయి. దీపావళి, లక్ష్మీపూజ, ఛత్‌ పూజ, గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి వంటి పండుగలు, కన్నడ రాజ్యోత్సవం వంటి ప్రాంతీయ విశేషాలు, వారాంతాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రాంతీయ పండుగలు, కార్యక్రమాలను బట్టి ఈ సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. ఇంకా చదవండి.


5. నేటి నుంచి కొత్త రూల్స్


మన దేశంలో, క్యాలెండర్‌లో కొత్త నెల ప్రారంభం కాగానే దేశవ్యాప్తంగా కొన్ని రూల్స్‌ మారతాయి. అంటే, పాత నిబంధనలకు మార్పులు-చేర్పులతో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. వీటిలో ఎక్కువ నియమాలు నేరుగా సామాన్యుడి డబ్బుల మీదే దృష్టి పెడతాయి. ఇప్పుడు, 01 నవంబర్‌ 2024 నుంచి కూడా కొన్ని రూల్స్‌ల మారాయి. రైలు ప్రయాణం కోసం ఐఆర్‌సీటీసీలో టిక్కెట్‌ బుక్‌ చేసుకోవడం నుంచి క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం వరకు చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. వాటిని ముందుగానే తెలుసుకోవడం మీ ఆర్థిక ఆరోగ్యానికి మంచిది. ఇంకా చదవండి.