AP Chandra Babu Making Tea In Srikakulam : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈదుపురంలో పర్యటించారు. అక్కడ ఉచిత గ్యాస్‌ పథకాన్ని ప్రారంభించారు. స్టౌవ్ వెలిగించిన చంద్రబాబు పాలు, టీ పొడి, పంచదార వేసి టీ చేశారు. టీ తయారీకి అవసరమైన వస్తువులు అందివ్వడంలో అక్కడి వారు కాస్త కంగారుపడుతుంటే కూల్‌గా ఉండాలని తాను వచ్చాననే టెన్షన్ వద్దంటూ చెప్పుకొచ్చారు. 


టీ మరిగిస్తూనే శాంతమ్మతో మాట్లాడి సీఎం చంద్రబాబు... కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీ మరిగిన తర్వాత ఆయనే వడపోసి అందరికీ  ఇచ్చారు. ఈ టీ బిల్లు చెల్లించాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌తో చమత్కరించారు. ఆయనకు కూడా అదే స్పీడ్‌తో... ఏ నిధుల నుంచి చెల్లించాలంటూ రిప్లై ఇచ్చారు. నీ ఇష్టమని కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నా అభ్యంతరం లేదన్నారు. 



అందరూ టీ తాగుతూ... ఈ మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఆలోచన ఎలా వచ్చింది. నాడు ఏం జరిగిందనే విషయాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఉండే కేంద్ర మంత్రి నాయక్‌కు ఈ ఆలోచన చెబితే ఎలా అవుతుందని ప్రశ్నించారన్నారు. తర్వాత చెబితే ఓకే చెప్పారన్నారు. ఇకపై మగవాళ్లు కూడా ఇంట్లో వంటలు చేయాలనే విషాయన్ని తరచూ తాను చెప్పే వాడినని చంద్రబాబు వివరించారు. డ్వాక్రా సంఘాలు తరచూ బయటకు వెళ్తూ ఉంటారని, గ్యాస్ స్టౌవ్‌లు కూడా వచ్చినందున మగవాళ్లు వంటలు నేర్చోవాలని సూచించినట్టు తెలిపారు. 
అదే టైంలో శాంతమ్మ ఫ్యామిలీని కేస్ స్టడీగా తీసుకొని ఉద్యోగ ఉపాధి సదుపాయాలు కల్పించాలన్నారు చంద్రబాబు. ఆ ఇంట్లో చదువుకున్న వ్యక్తులు ఉన్నారని.. వాళ్లకు మంచి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వర్క్‌ఫ్రమ్ హోం సదుపాయం కల్పిస్తే ఆర్థికంగా ఆ ఫ్యామిలీ వృద్ధి చెందుతుందన్నారు. ఇంటిపై సోలార్ పవర్ ప్యానెల్ పెట్టుకుంటే ఉచితంగా విద్యుత్ వాడుకోవచ్చని శాంతమ్మకు చంద్రబాబు సూచించారు. మీకు అవసరమైతే బయట నుంచి వాడుకోవచ్చని... మీకు కావాల్సినదాని కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తే అమ్ముకోవచ్చని కూడా తెలిపారు. 


అక్కడి నుంచి మరో ఇంటికి వెళ్లారు చంద్రబాబు నాయుడు. అక్కడ వాళ్ల ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి.. వాళ్లకు ఇంటిని మంజూరు చేశారు. రేపటి నుంచి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. మందులకే ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతుందని చెప్పుకున్న ఆ కుటుంబానికి వెంటనే రెండు లక్షల రూపాయలు మంజూరు చేశారు. అంతే కాకుండా వారికి నెల నెల మందులు ఖర్చు తగ్గించేందుకు ఏం చేయాలో ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. 


ప్రభుత్వం ఏటా ఇచ్చే మూడు గ్యాసి సిలిండర్ల పథకాన్ని ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురంలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మూడు రోజుల క్రితమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్‌ల బుకింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఆ సిలిండర్‌లు డెలివరీ అయ్యాయి. ఆ డబ్బులను రెండు రోజుల్లో లబ్దిదారుల ఖాతాల్లో వేస్తారు. 


Also Read: 'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల