ఉదయం 11 గంటలకు విజయవాడలో జరిగే బీసీ గర్జన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతారు.
మధ్యాహ్నం రెండు గంటలకి తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని గన్నవరం నుంచి నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరులో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
విజయవాడలో బీసీ ఘర్జన సదస్సు నిర్వహించనున్న ప్రభుత్వం
నేడు విజయవాడ లో బీసీ ఘర్జన సభ జరగనుంది. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఈ సభను ఏర్పాటు చేసింది. దీనికి జయహో బీసీగా నామకరణం చేసింది వైసీపీ. ఉదయం ప్రారంభమయ్యే ఈ మహాసభ సాయంత్రం వరకు కొనసాగుతుంది. దీనికి రాష్ట్రంలోని బీసీ సర్పంచులు, జడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరుకానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 80 వేల మందికిపైగా బీసీ ప్రజాప్రతినిధులు ఈ సభకు హాజరవుతారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. కొన్ని కీలక తీర్మానాలను ఈ మహాసభలో ఆమోదిచనున్నారు.
టీడీపీ ధర్నాలు
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపిస్తూ టీడీపీ ఇవాళ కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు చేయనుంది. నిన్న వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ కార్యాలయంలో బీసీ సదస్సు నిర్వహించింది. ఇందులో నేతలంతా ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. బీసీలకు సరైన ప్రధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేయనున్నారు.
ఇదేం ఖర్మ కార్యక్రమంలో నారా లోకేష్
బుధవారం సాయంత్రం 4 గంటలకు మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో నిర్వహించే 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొననున్నారు.