నేడు రాజమండ్రిలో సీఎం జగన్ పబ్లిక్ మీటింగ్.
ఏపీ సీఎం జగన్ నేటి నుంచి రాష్ట్రంలో పింఛన్ వారోత్సవాలను ప్రారంభించనున్నారు. సామాజిక పెన్షన్స్‌ను 2750 రూపాయలకు పెంచినందున సీఎం రాజమండ్రిలో ఈ ఉత్సవాలను బహిరంగ సభతో మొదలుపెట్టనున్నారు.
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. 11.20 – 1.10 వరకు ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం, అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగం, కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


తిరుమల కు భారీ ఆదాయం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రాన్ని లక్షల మంది దర్శించుకుంటారు. ఆపద సమయంలో తాము మొక్కుకున్న విధంగా ముడుపులు కట్టి ఆపదలు తొలగిన తర్వాత ముడుపులు భద్రంగా భక్తి భావంతో స్వామి వారికి సమర్పిస్తారు భక్తులు. ఇలా తమ తమ స్థోమతకు తగట్టుగా చిల్లర నాణేల నుంచి కోట్ల రూపాయల వరకు శ్రీవారి హుండీలో నగదు సమర్పిస్తారు భక్తులు. అయితే ఏడాదిలో‌ ఒక్కసారి మాత్రమే వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు భారీ స్థాయిలో‌ విరాళాలు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించారు. దీంతో టిటిడి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. కరోనా మహమ్మారి మానవాళిని కబళించిన సమయంలో శ్రీవారి దర్శనాలు 83 రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేసింది టీటీడీ. అనంతరం శ్రీవారి దర్శనాలు ప్రారంభించిన పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ ఉండడంతో అంతంత మాత్రంగానే హుండీ ఆదాయం లభించేది.. కరోనా పరిస్థితులు తొలగి మునుపటి రోజులు ప్రారంభం కావడంతో తిరుమలకు భారీ స్థాయిలో భక్తులు చేరుకుంటున్నారు.. ప్రతి రోజుకు లక్షకు పైగా భక్తులు వస్తుంటే అదే స్థాయిలో హుండీ ఆదాయం లభిస్తోంది.. 


కోవిడ్ తరువాత ప్రతినిత్యం భక్తులు పెద్ద ఎత్తున భక్తులు తిరుమల యాత్రకు వస్తున్నారు.. దీంతో ఏడుకొండలు గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. ఈ సారి ఒక్కరోజు హుండీ ఆదాయం భారీగా లభించింది..గతంలో ఎన్నడూ లేని విధంగా హుండీ ఆదాయం 6 కోట్ల మార్క్ ను దాటుతూ వచ్చింది.. అయితే సోమవారం  నివాసుడి అత్యంత ప్రీతికరమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి కావడంతో దేశంలోని ధనవంతులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు మొదలుకుని కటిక పేదవారు వరకూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తిరుమలకు క్యూ కట్టారు.. అయితే వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. ఈక్రమంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు వారి వారి స్థోమతకు తగ్గట్టుగా వైకుంఠ ఏకాదశి నాడు స్వామి‌ వారిపై భక్తితో హుండీలో విరాళాలు సమర్పించారు. దీంతో వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి హుండీ ఆదాయం ఘననీయంగా పెరిగింది.. కనివిని ఎరుగని రీతిలో రికార్డ్ స్థాయిలో ఒక్కరోజు హుండీ ఆదాయం రావడం విశేషం.. శ్రీవారి హుండీ ఆదాయం ₹రూ: 7.68 కోట్ల రూపాయలు శ్రీవారి హుండీ ఆదాయంగా సమర్పించారు భక్తులు.. శ్రీవారిని ఆదివారం ఒక్కరోజే 69,414 మంది భక్తులు దర్శించుకున్నారు.. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం జులై-27-2018లో ₹రూ: 6.28 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం రాగా, గత ఏడాది అక్టోబర్ 23వ తారీఖులన 6.31 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం లభించింది.. అయితే వైకుంఠ ఏకాదశి నాడు ఇప్పటికీ వరకూ వచ్చి‌ హుండీ ఆదాయంను రికార్డును దాటింది. అంతకు మునుపు 2012-జనవరి-1వ తేదీ ₹రూ: 4.23 కోట్ల రూపాయలు రికార్డ్ ఉండగా అదే ఏడాది 2012-ఏప్రిల్-1వ తేదీ ₹రూ: 5.73 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం లభించింది.


ఏపిలో రోడ్ షోలు, సభలు,సమావేశాలు, ర్యాలీలు జరపకూడదని ఏపి ప్రభుత్యం జీ.ఓ విడుదల చేసింది. 1861 పోలీస్ యాక్ట్ ప్రకారం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కందుకూరు, గుంటూరు ఘటనల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతూ జాతీయ,రాష్ట్ర,మున్సిపల్ పంచాయతీ రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది జగన్ ప్రభుత్వం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనీ ప్రత్యేక పరిస్థితుల్లో అన్ని అనుమతులతో కూడిన ప్రదేశాల్లో సభలు పెట్టుకునేందుకు అనుమతి ఇస్తామని ఏపీ సర్కారు చెప్పింది.


ర్యాలీలు, సమావేశాలు బంద్‌


ఏపీలో ర్యాలీలు, సభలు, సమావేశాలు, రోడ్ షోలు జరపకూడదని జీవో ఇవ్వటం దుర్మార్గం అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందనీ కందుకూరు, గుంటూరు ప్రమాద ఘటనలను సాకుగా చూపి జగన్ సర్కార్ తీసుకున్న నిరంకుశ నిర్ణయం ఇదని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు మానుకుంటారా! అన్న రామకృష్ణ ప్రజాఉద్యమాలను, ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగమే 1861 పోలీస్ యాక్ట్ ఉత్తర్వులు అని ఆరోపించారు. ప్రత్యేక పరిస్థితుల్లో సభలు పెట్టుకునేందుకు అనుమతి ఇస్తామంటున్నారు అంటే
వైసీపీ శ్రేణులకు మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తిస్తాయా? అని ఆయన ప్రశ్నించారు.