* ఈ రోజు (జనవరి 25) వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 175 పశు అంబులెన్స్ లను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
* నేడు ఉదయం ఇంద్రకీలాద్రికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. వారాహి వాహనానికి పూజలు నిర్వహించనున్నారు.
* మంగళగిరి: బుధవారం ఉదయం 11 గంటల నుంచి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో 'ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో వైసీపీ సర్కార్ నిర్లక్షం'పై చర్చ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొంటారు.
* లోకేష్ పాదయాత్ర సండర్భంగా విశాఖ తూర్పు MLA వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.
* అమరావతి: రాష్ట్రంలో పద్దెనిమిది మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో గంజాయి కలకలం రేపింది. కడియం పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో యువత గంజాయి మత్తులో జోగుతుంది. స్థానికంగా రిటైల్ గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి 21 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కడియం సీఐ తిలక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయి కనుగొని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నామని మరో యువకుడు పరారీలో ఉన్నట్లు సి ఐ వెల్లడించారు. పట్టుబడిన వారిలో కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన ఇద్దరు, దుల్ల గ్రామానికి చెందిన మరో యువకుడు ఉన్నట్లు తెలిపారు, ఈ గంజాయి ఎక్కడ నుండి వచ్చింది ఎవరెవరికి సరఫరా అవుతుoది ?ఎక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి? ఎల రవాణా అవుతుంది అనే వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని ఈ కేసును తమ తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు సీఐ తెలిపారు.