Today Top Headlines In Telugu States:
1. పవన్ కల్యాణ్ ను వెంటాడుతోన్న ప్రకాష్ రాజ్
నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రీనాథ్ అనేది సినిమా డైలాగ్.. నువ్వు డిప్యూటీ సీఎం అయితే నేను ప్రకాష్, ప్రకాష్ రాజ్.. ఇది రియల్ లైఫ్ డైలాగ్. తిరుమల లడ్డూ వివాదం పవన్ కల్యాణ్(Pawan kalyan), ప్రకాష్ రాజ్(Prakash raj) వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఈ పోరులో ప్రకాష్ రాజ్ ఎక్కడా తగ్గేలా లేరు. మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని ఉద్దేశిస్తూ ఘాటు ట్వీట్ వేశారు. తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదంపై పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్‌తో ఈ గొడవ మొదలైంది. ఆ ట్వీట్‌కి ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. మీరు డిప్యూటీసీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ గొడవ జరిగింది. దీనిపై మీరు ఇన్వెస్టిగేషన్ చేయించండి. ఇంకా చదవండి.
2. తిరుమలేశునికి మాధవీలత లేఖ
తిరుమల లడ్డూ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అసదుద్దీన్‌పై పోటీ చేసిన మాధవీలత అయితే తిరుమలేశుడికి లేఖ రాశారు. క్షమాపణ కోరుతూ రాసిన ఆ లేఖను హుండీలో వేయనున్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి అంటే తెలుగు రాష్ట్రాల్లోనో దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే హిందువులు పవిత్రంగా భావిస్తారన్నారు రాజాసింగ్. అలాంటి పవిత్రమైన గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని అపవిత్రం చేసి అందులో జంతువుల కొవ్వును కలపడం దారుణమన్నారు. ఇంకా చదవండి.
3. వెంకట్రామిరెడ్డి నిర్వాకంతో సచివాలయ ఉద్యోగ సంఘం రద్దు
వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘం నేతలు కూడా వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేశారు. సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి ఒక అడుగు ముందుక వేసి వైసీపీ కోసం ప్రచారం చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆయన అదే పని చేయడంతో ఎన్నికల సంఘం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్నుంచి ఆయన సస్పెన్షన్ లోనే ఉన్నారు. తాజాగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రభుత్వం ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఇంకా చదవండి.
4. బతుకమ్మ పండుగ వెనుక కథలెన్నో
గుట్టలు, గట్లు, చేలు, అడవి..ఇలా ఎక్కడెక్కిడి నుంచో ఏరితీసుకొచ్చి పూలను ఓ చోట అందంగా పేర్చి బతుకునిచ్చే బతుకమ్మగా భావించి పూజిస్తారు. అదే బతుకమ్మ పండుగ. అందరూ బతుకమ్మలను ఒకేలా పేరుస్తారు కానీ చిన్న వ్యత్యాసం కనిపిస్తుంది. కొందరు శివలింగంలా పేరిస్తే..మరికొందరు బౌద్దుల స్థూపాకారంలో పేర్చుతారు. ఇంకా చదవండి.
5. హైదరాబాద్‌లో బాంబులతో ఇంటిని కూల్చేసిన అధికారులు
హైదరాబాద్‌లో హైడ్రా ప్రభావంతో అక్రమ కట్టడాలు నేల కూలుతున్నాయి. ఎన్ని విమర్శలు రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నా అధికారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అక్రమంగా కట్టిన నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి కూల్చేస్తున్నారు. అలానే సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని మల్కాపూర్‌లో కట్టడం కూల్చివేత కోసం బాంబులు వాడాల్సి వచ్చింది. ఇంకా చదవండి.