VIP darshan can be done without recommendation letters: తిరుమల శ్రీవారి దర్శనం ప్రతి ఒక్క హిందువుకు ఎంతో ముఖ్యం. పుట్టిన రోజు నాడు అయినా .. జీవితంలో ఏదైనా సాధించిన రోజు అయినా.. దూర ప్రాంతంలో ఉండి సొంత రాష్ట్రానికి వచ్చినా ముందుగా శ్రీవారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు.అందుకే తిరుమల కొండలపై ఎప్పుడూ విపరీతమైన రద్దీ ఉంటుంది. 300 దర్శనం టిక్కెట్లను మూడు నెలల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉటుంటుంది. ఇక వీఐపీ దర్శన టిక్కెట్లకు అయితే రాజకీయ నేతల సిఫారసు లేఖలు అవసరం.
అయితే రాజకీయ నేతల సిఫారసు లేఖలు అవసరం లేకుండానే శ్రీవారి పథకం ద్వారా వీఐపీ దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఎయిర్ పోర్టునూ ఈ ఫెసిలిటీ ఉంది. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన వెంటనే శ్రీవాణి టిక్కెట్లు కొనుగోలు చేసి వీఐపీ దర్శనానికి వెళ్లవచ్చు. ఇప్పటి వరకూ ఉన్న శ్రీవాణి టికెట్ల సంఖ్య పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ణిగుంట విమానాశ్రయంలో ప్రతిరోజూ జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ 100 నుండి 200 కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
Also Read : దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తారు. అలాగే తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్ లో ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుండి 800 కు తగ్గించారు. మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు. అంటే రోజుకు వెయ్యి మంది వరకూ వీఐపీ దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనం టిక్కెట్ రూ. 10వేలు ఉంటుంది. ఇప్పటి వరకూ శ్రీవాణి ట్రస్ట్ కు పదివేలు విరాళం ఇచ్చే వారికి రూ. 500 కలిపి మొత్తం పదివేల ఐదు వందలకు ఈ టిక్కెట్ ఇస్తున్నారు. నిధులన్నీ శ్రీవారి ట్రస్టుకు వెళ్లేవి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రూల్స్ మార్చారు.