Tirumala Udayasthamana Seva Tickets: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. నేటి నుంచి భక్తులకు ఉదయాస్తమాన సేవా టికెట్లను దాతలకు అందుబాటులో ఉంటాయి. ఖాళీ అయిన 531 సేవా టికెట్లను టీటీడీ అధికారులు భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. కేవలం శుక్రవారం రోజు అయితే దాతలు రూ.1.5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వారంలో మిగిలిన రోజుల్లో రూ.1 కోటి విరాళంగా దాతలు ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ తెలిపింది.


శ్రీవారి ఉదయాస్తమాన సేవల ఖాళీల ధరలపై కొన్ని రోజుల కిందట నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి తిరుమల శ్రీవారి భక్తులకు టికెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. బుధవారం ఉదయం 9.30 గంటలకు ఆన్‌లైన్‌లో విరాళాల స్వీకరణ ప్రారంభం అయింది. తిరుపతిలో చిన్నపిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం దాతల నుంచి విరాళాలు కోరుతోంది. టీటీడీ ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా విరాళాలు అందించవచ్చు. 


సర్వదర్శనం టికెట్లు.. 
చిత్తూరు జిల్లా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపి వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేటి నుంచి పునః ప్రారంభించింది. ఈ తెల్లవారు జామున 5 గంటల నుంచి సర్వ దర్శనం టోకెన్లను ఆఫ్లైన్ ద్వారా భక్తులకు జారీ చేసింది. రోజుకు పది వేల టికెట్ల చోప్పున తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రాల్లో ఉచిత దర్శనం టికెట్లను జారీ చేస్తుంది టీటీడీ.


కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్ధం దేశ విదేశాల‌ నుండి భక్తులు తిరుమలకు చేరుకుంటారు. కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామి వారి దర్శనంకు టీటీడీ‌ అనుమతిస్తూ వస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను జారీ చేస్తూ వచ్చేది టీటీడీ. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు దర్శన టోకెన్ల అందక ఇబ్బందులు వచ్చేవి. దీంతో భక్తులు టీటీడీకి లేఖలు, ఫోన్ ద్వారా తమ సమస్యలు విన్నవించడంతో వైద్య నిపుణుల సూచనలు, సలహాలు మేరకు కోవిడ్ పరిస్ధితులు అనుకూలించడంతో ఆఫ్లైన్ లో‌సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తుంది


హనుమన్ జన్మస్ధల విస్తార మహోత్సవం..
నేడు తిరుమల అంజనాద్రిలో హనుమన్ జన్మస్ధల విస్తార మహోత్సవం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 9:30 గంటల నుండి 11 గంటల నడుమ ఆకాశగంగ తీర్ధంలో టీటీడీ భుమి పూజ చేస్తోంది. ఆకాశగంగ తీర్ధంను దివ్యాంగ సుందరంగా తీర్చి దిద్దేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద, ఉత్తర పీఠాధిపతి సత్మనందేంద్ర సరస్వతి, చిత్రకూటం పీఠాధిపతి జగద్గురు శ్రీ రామభద్రాచార్యలు భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యారు.


Also Read: Medaram Jatara 2022: నేడు తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రారంభం, పగిడిద్దరాజు రాకతో తొలి ఘట్టం


Also Read: Medaram Jatara: సమక్క దేవత ఎలా అయింది? ఈ మహా జాతరకు దారితీసిన పరిస్థితులేంటి?