TTD Introduced UPI System: శ్రీవారి భక్తులు ఇక తిరుమలలో నగదు రహిత సేవలు పొందవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకూ తిరుమలలో నగదుతో కూడిన విధానంకు బదులుగా నగదు రహిత విధానంను అవలంభించేందుకు టిటిడి చర్యలు చేపట్టింది.  గదులు కేటాయింపు వద్ద నుండి వివిధ లావాదేవీలను ఏటిఏం కార్డుల స్వైపింగ్ విధానం  ద్వారా జరుపుతూ వచ్చింది.  మొదటగా స్వైపింగ్ విధానంలో టిటిడికి కొంత ఇబ్బందుకు తలెత్తినా, అటు తరువాత ఆ లోపాలను పూర్తి స్ధాయిలో పరిష్కరించి భక్తులకు స్వైపింగ్ విధానంను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చింది.


అమెరికా పౌరుడికి భారత అంతర్గత విషయాలెందుకు ? మరో సారి విష్ణువర్ధన్ రెడ్డి వర్సెస్ సిద్ధార్థ్


టిటిడిలో డిజిటల్ చెల్లింపులు చేయాలంటే క్రెడిట్, డెబిట్ కార్డు తప్పనిసరి చేసింది.. ఇక తిరుమలలో వసతి గదులు పొందాలంటే కచ్చితంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు తప్పని సరి చేసింది. మొదట్లో ఈ విధానంతో భక్తులు ఇబ్బందుకు ఎదుర్కొన్నా అటుతరువాత భక్తులు ఈ విధానంకు అలవాటు పడ్డారు. ప్రస్తుత సమాజంలో అందరూ స్మార్ట్ ఫోన్ తప్పని సరిగా ఉపయోగిస్తున్న నేపధ్యంలో స్మార్ట్ ఫోన్లో ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్స్ యాప్స్ అధికంగా ఉపయోగిస్తున్నారు. కార్డు పేమెంట్స్ కన్నా యూపీఐ పేమెంట్స్ మరింత సులభం, మరింత సురక్షితం అని టీటీడీ భావించింది. 


పోటీ పడి మరీ బీజేపీ అభ్యర్థికి మద్దతు ! ఏపీ రాజకీయ పార్టీలు రాష్ట్రానికి ఏం సాధించాయి ?


టిటిడిలో పేమెంట్ విధానంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.. నగదు చెల్లింపు స్థానంలో యూపిఐ విధానాన్ని  బుధవారం నుంచి ప్రవేశపెట్టారు టీటీడీ అధికారులు. పైలెట్ ప్రాజెక్ట్ క్రింద వసతి గదులు కేటాయింపు సమయంలో యూపిఐ విధానం ద్వారా చెల్లింపులు ప్రారంభించింది.. యూపిఐ విధానం అందుబాటులోకి రావడం వసతి గదులు ఖాళీ సమయంలో భక్తులకు వేగవంతంగా నగదు చెల్లించే వెసులుబాటు కలుగుతోంది.. త్వరలోనే టిటిడికి సంబందించిన అన్ని చెల్లింపులు యూపిఐ విధానంలోనే చేసేలా చర్యలు తీసుకుంటున్నారు టిటిడి‌ అధికారులు.


ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ సేవలు - సీఎం జగన్ ఆదేశం!


ఇక తిరుమలలో యూపిఐ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే, గదులు కేటాయింపు సమయంలో నగదు లావాదేవీలకు అవకతవకలకు అవకాశం ఉండదని టీటీడీ అధికారులు భావిస్తున్నారు..యూపిఐ విధానంను టిటిడిలో ప్రవేశ పెట్టడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగదు సమస్యతో చాలా మంది భక్తులు ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం లభించినట్లయింది.