Tirupati Fire Accident: చాలా మందికి ఏదైనా కొన్న వెంటనే వాటిని వాడటం అలవాటు. అయితే దీపావళి పండుగ సందర్భంగా ఓ వ్యక్తి టపాసులు కొనుగోలు చేశాడు. అతడి అత్యుత్సాహంతో బాణాసంచా దుకాదారులతో పాటు కొనుగోలు దారులను పరుగులు పెట్టాల్సి వచ్చిందంటే. ఎందుకంటే.. కొనుగోలు చేసిన బాణాసంచాల నాణ్యతను పరిశీలించాకున్నాడు. ఆత్రం ఆగలేక పరుగున వెళ్లి దుకాణానికి దగ్గర్లోనే టపాసులను వెలిగించాడు. దీంతో ఆ బాణాసంచా పేలి నిప్పురవ్వలు చుట్టుపక్కల ఉన్న దుకాణాల్లోకి ఎగిసి పడ్డాయి. దీంతో స్థానికంగా ఉన్న దుకాణాలన్నింటిలో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న టపాసులన్నీ పేలి పోయాయి. అయితే విషయం గుర్తించిన దుకాణాదారులు, కొనుగోలుదారులు అప్రమత్తమై దూరంగా పరుగులు పెట్టారు.
ఈ ఘటన తిరుపతి జిల్లాలోని వడవలపేట మండలంలోని నారాయణదాసు తోటలో చోటు చేసుకుంది. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజిన్ తో వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. టపాసుల దుకాణాల యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పండుగ వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- టపాసులు కాల్చేటప్పుడు కళ్లకు కూలింగ్ గ్లాసెస్ వంటివి ధరించడం మంచిది.
- పెద్ద పెద్ద బాంబులు కాలుస్తుంటే చెవులు దెబ్బతినకుండా చెవుల్లో దూరి ముద్దలు పెట్టుకోవడం మంచిది.
- పేలకుండా మధ్యలో ఆగిపోయిన టపాసులను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వెలిగించకూడదు.
- అది మండకపోయినా లోపల ఉండిపోతే దాన్ని చేతిలోకి తీసుకోగానే పేలే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి.
- ముందు జాగ్రత్తగా అలాంటి వాటిపై నీటిని చల్లి తడపండి.
- అలాగే బాణాసంచాలను ఇంట్లో కాల్చకూడదు.
- బహిరంగ ప్రదేశాల్లోనే వాటిని పేల్చండి.
- జేబుల్లో టపాసులు పెట్టుకుని తిరగడం చాలా ప్రమాదకరం.
- గాజు కంటెయినర్లు, లోహపు పాత్రల్లో టపాసులు పేల్చడం ప్రమాదకరం.
- మీరు ఏవైనా జంతువులను పెంచుకుంటే వాటికి దూరంగా టపాసులు కాల్చాలి. అలాగే వీధిలో ఉన్న పశువులకు దూరంగా మాత్రమే బాణాసంచాలు కాల్చాలి. అందరూ
- ఒకేసారి కాకుండా.. ఒక్కొక్కరూ ఒక్కోసారి కాల్చాలి.
చేయాల్సిన పనులు..
- బాణాసంచాను పేల్చడానికి ముందు.. టపాసుల ప్యాకింగ్ లపై ఉండే సూచనలను చదవండి.
- మంటలు అంటుకునే అవకాశం ఉన్న ప్రాంతాలకు, ద్రావణాలకు దూరంగా బాణాసంచాను పేల్చాలి.
- భవనాలు, చెట్లు, ఎండగడ్డి లాంటి చోట టపాసులు పేల్చడం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ.
- కాల్చిన బాణాసంచా సామగ్రిని ఇసుక పోసి ఓ ప్లాస్టిక్ బకెట్ తో నీటిని సిద్ధంగా ఉంచుకోండి.
- బాణాసంచా కాల్చేటప్పుడు చేతులను టపాసుకు దూరంగా ఉంచి జాగ్రత్తగా అంటించాలి.
- అలాగే టపాసుకు ముఖాన్ని దూరంగా ఉంచడం మర్చిపోవద్దు.
- ఒకవేళ కళ్లల్లో ఏమైనా నిప్పు రవ్వలు, చెత్త వంటివి పడ్డట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకూడదు.
- బాణాసంచా కాల్చేటప్పుడు చేతులు కాలినా, గాయాలు అయినా వాపులు వంటివి వచ్చినా ముందుగా చల్లని నీటిని పోయాలి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.
- ఇంట్లో ఎవరైనా శ్వాస సమస్యలతో బాధపడుతుంటే వారికి చాలా దూరంగా టపాసులు కాల్చాలి. పొగ కాలుష్యమై వారికి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
- అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.