Tirumala Srivari Arjitha Seva Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్‌డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ నెలకుగానూ శ్రీవారి ఆర్జిత సేవల కోసం లక్కీ డిప్ తేదీలను ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు జూన్ 27న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జూన్ 27న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తోంది టీటీడీ (Tirumala Tirupati Devasthanams). సెప్టెంబర్ నెలకు గానూ ఈ ఆర్జిత సేవా టికెట్లను జూన్ నెలాఖర్లోనే భక్తులను టీటీడీ అందుబాటులో ఉంచుతోంది. ఈ మేరకు ఆలయ అధికారులు శ్రీవారి సేవలు, ఆర్జిత సేవా టికెట్లు, లక్కీ డిప్‌పై ప్రకటన విడుదల చేశారు.


కరోనా వ్యాప్తి తరువాత తొలిసారిగా...
కోవిడ్ మహమ్మారి ఆంక్షల తర్వాత టీటీడీ.. భక్తులకు ఆర్జిత సేవల టికెట్లు (Srivari Arjitha Seva Tickets), లక్కీ డిప్ టికెట్లు రెండూ ఆన్ లైన్‌లో అందుబాటులోకి తేవడం ఇదే మొదటిసారి. అదే విధంగా జూలై నెలకుగానూ టీటీడీ స్థానిక ఆలయాల్లో సేవల టికెట్లు జూన్ 27న విడుదల చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులు టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఆ మరుసటి రోజు సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగుల జూలై నెల టికెట్ల కోటాను విడుదల చేస్తున్నారు. జూలై 28న సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఉదయం 10 గంటలకు బుకింగ్ ప్రారంభించనున్నారు.


శుక్రవారం నాడు 71,589 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి హుండీకి భక్తుల కానుకల రూపంలో రూ.4.30 కోట్లు మేర ఆదాయం సమకూరింది. 41,240 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం కూడా రద్దీ క్రమేపీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ‌ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.  కోవిడ్ 19 వ్యాప్తి తరువాత గత కొంతకాలం నుంచి తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కళకళ‌ లాడుతుంది. ఎటు చూసినా భక్తుల గోవింద నామస్మరణలతో ఏడు కొండలు మారుమోగుతున్నాయి. వేసవి సెలవులు, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. స్వామి వారి దర్శనార్థం 2 కి.మీ మేర భక్తులు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు.


Also Read: Kurma Jayanti 2022 : ఈ ఆలయం నుంచి వారణాసికి సొరంగ మార్గం! ఇక్కడ పుష్కరిణిలో అస్తికలు కలిపితే గంగలో కలిపినట్టే!


Also Read: Jagannath Rath Yatra 2022 : జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!