Tiruchanoor News: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 28 నుండి డిసెంబరు 6వ తేదీ జరుగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు సంబంధించిన రోజువారి కార్యక్రమాల బుక్ లెట్ ను సోమవారం టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 28వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయన్నారు. డిసెంబరు 2వ తేదీ గజవాహనం, డిశెంబరు 3న బంగారు రథం, డిశెంబరు 5న రథోత్సవం, డిశెంబరు 6వ పంచమితీర్ధం వుంటుందని తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు.
వాహనసేవల వివరాలు :
తేదీ 28-11-2024
ఉదయం - ధ్వజారోహణం
రాత్రి - చిన్నశేషవాహనం
29-11-2024
ఉదయం - పెద్దశేషవాహనం
రాత్రి - హంసవాహనం
30-11-2024
ఉదయం - ముత్యపుపందిరి వాహనం
రాత్రి - సింహవాహనం
01-12-2024
ఉదయం - కల్పవృక్ష వాహనం
రాత్రి - హనుమంతవాహనం
02-12-2024
ఉదయం - పల్లకీ ఉత్సవం - వసంతోత్సవం,
రాత్రి - గజవాహనం
03-12-2024
ఉదయం - సర్వభూపాల వాహనం - సాయంత్రం - స్వర్ణ రథం,
రాత్రి -గరుడవాహనం
04-12-2024
ఉదయం - సూర్యప్రభ వాహనం
రాత్రి - చంద్రప్రభ వాహనం
05-12-2024
ఉదయం - రథోత్సవం
రాత్రి - అశ్వ వాహనం
06-12-2024
ఉదయం - పంచమితీర్థం
రాత్రి - ధ్వజావరోహణంతో ముగుస్తుంది.