Sabarimala Yatra: అయ్యప్ప మాల వేసి శబరిమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. ప్రైవేటు బస్‌లు, వాహనాలు బుక్ చేసుకొని ఇబ్బంది పడకుండా క్షేమంగా ఎలాంటి సమస్యల్లేకుండా ఉండేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీ సిద్ధం చేసింది. ఈ నెల(నవంబర్) 16 నుంచి ఈ ప్యాకేజీ మొదలు కానుంది. ఇందులో ఒక్కొక్కరు వెళ్లి రావచ్చు. లేదా బల్క్‌గా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
"శబరిమల యాత్ర (SABARIMALA YATRA) పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌లో ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో ఈ శబరిమల యాత్ర కోసం 2AC, 3AC & SL తరగతులను బుక్ చేయనుంది. ఇది ఐదు రోజుల యాత్ర. సికింద్రాబాద్‌లో బయల్దేరే ట్రైన్ శబరిమల(సన్నిధానం) - చొట్టానికరకు చేరుకుంటుంది. దీని కోసం మొత్తంగా 716 సీట్లు కేటాయించారు. స్లీపర్ క్లాస్ టికెట్లు : 460, 3AC: 206, 2AC: 50 సీట్లు ఉంటాయి.
ఏ ఏ స్టేషన్‌లలో శబరిమల యాత్ర ట్రైన్ ఆగుతుంది?
సికింద్రాబాద్‌లో ఈనెల 16 బయల్దేరే ట్రైన్... నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరులో ఆగుతుంది. సికింద్రాబాద్‌లో ఉదయం 8 గంటలకు బయల్దేరనుంది. శబరిమల చేరుకునే సరికి మరుసటి రోజు సాయంత్రం ఏడు గంటలు అవుతుంది.
టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు
కేటగిరి | పెద్దలకు | చిన్నపిల్లలకు (5-11 year) |
ఎకానమి | రూ. 11475 | రూ. 10655 |
స్టాండర్డ్ | రూ. 18790 | రూ. 17700 |
కంఫర్ట్ | రూ. 24215 | రూ. 22910 |
ఈ ట్రైన్‌లో వెళ్లిన వాళ్లు ఏ ఏ ప్రాంతాలను తిరిగవచ్చు
శబరిమల(అయ్యప్ప దర్శనం)
చొట్టానికర: (చొట్టానికర దేవి ఆలయం)
మరింత సమాచారం కోసం ఫోన్ చేయాల్సిన నెంబర్లు
సంప్రదించాల్సిన వారి పేరు | ఫోన్ నెంబర్ | అడ్రెస్ |
జోనల్ ఆఫీస్ | 040-27702407 / 9701360701 | IRCTC, South Central Zone, 9-1-129/1/302, 3rd Floor, Oxford Plaza, S.D. Road, Secunderabad, Telangana |
Mallesh | 9281495843 | |
Jayanth | 9281495845 | |
Pawan Sengar | 8287932228 | |
Sashidhar | 8287932229 | |
Ch Satish | 9281030712 | |
Naresh Orsu | 9281030711 | |
Santhosh | 9281030734 | |
Akhila | 9281030705 | |
Ch Balaji | 9281030714 | IRCTC Vijayawada, Near Railway Retiring Room, Vijayawada |
K Pavan | 8287932313 | IRCTC Tirupati, Platform No.1, 1st Floor, Retiring Rooms Complex, Tirupati Railway Station |
Yesaiah |
9281495853 | |
Chandan Nath | 9281030748 | Visakhapatnam Railway Station, Platform No.1, Besides APTDC Counter, Visakhapatnam |