Ayyanna Patrudu Sensational Comments : తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓ దుర్మార్గుడు పరిపాలిస్తున్నాడని, అతడి బారి నుంచి తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారే ప్రజల్ని రక్షించాలంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏపీలో విచ్చలవిడిగా దోపిడి జరుగుతుందని.. రాష్ట్రంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఎంతగానో నష్టపోయారని చెప్పారు. బుధవారం నాడు టీడీపీ నేత అయ్యన్న శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ‌.పి‌ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.


రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో‌ పాల్గోనడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కరోనా కారణంగా గత ఏడాది కాలంగా స్వామి వారిని దర్శనానికి రాలేక పోయినట్లు చెప్పారు. నేడు తన పెళ్లి రోజు సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు కోసం తిరుమలకు వచ్చానని చెప్పారు.


దుర్మార్గుడి నుంచి రక్షించండి స్వామి..
ఆంధ్రప్రదేశ్ ను ఒక దుర్మార్గుడు పాలిస్తున్నాడని, అతడి నుండి ప్రజల్ని రక్షించాలని స్వామి వారిని ప్రార్ధించానని అయ్యన్న పాత్రుడు చెప్పారు. ‌రాష్ట్రం నష్ట పోవడమే కాకుండా, అన్ని వర్గాల ప్రజలు నష్ట పోయారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏపీలో విచ్చలవిడిగా దోపిడి జరుగుతుందని ఆరోపించారు. పుణ్యక్షేత్రంకు వచ్చే భక్తులను కూడా వైసీపి ప్రభుత్వం దోచుకుంటుందని, తిరుమలకు వచ్చిన భక్తులకు సరైన వసతులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. 


ప్రచారాన్ని మరిచిపోయిన టీటీడీ 
శ్రీవాణి ట్రస్టులో 3700 రూపాయలే స్వామి వారికి చేరుతుందని, మిగిలిన నగదు ట్రస్టుకి వెళ్తొందని‌, ట్రస్టు పేరుతో భక్తుల సొమ్మును ప్రభుత్వం దోచుకుంటుందని ఆయన మండిపడ్డారు. పలు రకాల అధికారులు వచ్చి సాంప్రదాయాన్ని ప్రక్కన పెడుతున్నారని, హిందూ సాంప్రదాయంను ప్రచారం చేయడం టీటీడీ మరిచి పోయిందని ఆరోపించారు. దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టిఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఒంగోలులో‌ మహానాడుని అడ్డుకునే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. వైసీపి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుకు పెట్టినా, రైతులు ముందుకు వచ్చి మహానాడు నిర్వహణకు భూమిని ఇచ్చారన్నారు. మహానాడు ప్రజలు ఆదరించారని, దుర్మార్గుడి పరిపాలనకు ఈ మహానాడు నాంది పలుకుందని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. 


Also Read: Tirumala Plastic Ban : శ్రీవారి భక్తులకు అలెర్ట్, జూన్ 1 నుంచి తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం


Also Read: Minister Jogi Ramesh : చంద్రబాబు మాయల ఫకీరు, మహానాడు అంటే తొడలు కొట్టడం, బూతుల తిట్టడమే - మంత్రి జోగి రమేష్