TTD Hereditary Archaka System: తిరుమల : కలియుగ దైవం శ్రీనివాసుడి సన్నిధి తిరుమల శ్రీవారి ఆలయంలో వంశపారం పర్య అర్చకుల సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదు. ఈ క్రమంలో శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వంశపారం పర్య అర్చకుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ శివశంకర్ కమిటీ నివేదికను బయట పెట్టాలని కోరారు.


రెండేళ్ల కిందట కమిటీని నియమించినా, నేటికి ఆ నివేదిక బయట పెట్టలేదు అని ట్విట్టర్ లో తెలిపారు రమణ దీక్షితులు. ఈ నివేదిక బహిర్గతం చేయడం ద్వారా వంశపారంపర్య అర్చకుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా అర్చక సమాజం సీఎం జగన్ కు రుణపడి ఉంటుందన్నారు. 21 జూలై 2021 జీవో ఎంఎస్ నెంబ 185 ప్రకారం జస్టిస్ శివశంకర్ రావు ఏకసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదకి బహిర్గతం చేయాలని శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ కి విజ్ఞప్తి చేశారు.






ఆనందనిలయాన్ని వీడియో తీసిన యువకుడు అరెస్ట్ 
ఆనంద నిలయాన్ని వీడియో తీసారంటూ టీటీడీ విజిలెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రెండు ప్రత్యేక బృందాలు, ఒక టెక్నికల్ టీంను నియమించి నిందితుడి కోసం గాలించామని ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు.  కరీంనగర్ కి చెందిన రాహుల్ రెడ్డి శ్రీవారి ఆలయంలో వీడియోలు తీసినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి గురువారం సాయంత్రం రాహుల్ ని అదుపులోకి తీసుకున్నామన్నారు. భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి రాహుల్ మొబైల్ ఫోన్ ని ఆలయంలోకి తీసుకెళ్లాడని, ఆలయంలో తీసిన వీడియోలను రాహుల్ స్టేటస్ లో పెట్టడంతో పాటు వారి బంధువులకు పంపించిన్నట్లు విచారణలో తేలిందన్నారు.                                


ఆలయంలో వీడియో తీసింది వివాదమవుతున్నట్లు మీడియాలో రావడాని చూసిన రాహుల్ ఎవిడెన్స్ ని చేరిపి వేశాడన్నారు.. రాహుల్ ని ఆలయంలోకి తీసుకెళ్లి భద్రతా లోపం ఎక్కడ జరిగిందో పునః పరిశీలిస్తున్నామని  మునిరామయ్య తెలిాపరు.  భక్తుల మొబైల్ ఫోన్ ని ఆలయం లోపలకి అనుమతించమని, భద్రతా లోపాలని గుర్తించి, పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.. రాహుల్ ఏ ఆలయంకు వెళ్ళినా, ఆ ఆలయాన్ని వీడియో తీస్తున్నాడని, ఆ క్రమంలోనే శ్రీవారి ఆలయంలో చిత్రికరణ చేశాడన్నారు. గత నెలలో  తిరుమలలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని  ఎస్పీకి  మెయిల్ వచ్చింది.ఈ మెయిల్  ఫేక్ అని  పోలీసులు తేల్చి చెప్పారు.