Padmavati Express Derails In Tirupati: తిరుపతిలో పద్మావతి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్ యార్డ్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైలును షంటింగ్ చేస్తుండగా ఒక బోగీ పట్టాలు తప్పింది. ఫలితంగా సాయత్రం 4.55 గంటలకు బయలుదేరాల్సిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను రాత్రి 7.45కు రీషెడ్యూల్ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరాల్సిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్ చేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని తిరుపతి రైల్వే అధికారులు తెలిపారు.


తిరుపతి రైల్వే స్టేషన్ లోతిరుపతి - తిరువనంతపురం ట్రైన్ చివరి బోగి పట్టాలు తప్పింది. ట్రైన్ కు ప్యాసింజర్స్ లేని  భోగిని అటాచ్ చేసే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రైల్వే సిబ్బంది వెంటనే గుర్తించి బోగీని పట్టాల పైకెక్కించారు. దాంతో కొన్ని రైళ్లను రీ షెడ్యూల్ చేశారు రైల్వే అధికారులు.






ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన తరువాత ఏపీ, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా పలు రైలు ప్రమాదాలు జరిగాయి. అయితే కోర మండల్ ఎక్స్ ప్రెస్ ఘటనతో రైలు ప్రమాదం అని తెలియగానే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత నెలలో విజయనగరం జిల్లా ఎస్ కోట మండలంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇనుము లోడ్ తో కిరండల్ నుంచి విశాఖకు వస్తుండగా ఎస్ కోట మండలంలోని బొడ్డవదర వద్ద గూడ్స్ రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. క్రాసింగ్ సమయంలో 6 బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. దాంతో ఆదివారం రాత్రి విశాఖ నుంచి బయలుదేరనున్న విశాఖ- కిరండోల్ ఎక్స్ ప్రెస్ ను రైల్వే అధికారులు రద్దు చేశారు. గూడ్స్ పట్టాలు తప్పిందన్న సమాచారం అందడంతో రైల్వే అధికారులు, డీఆర్ఎం బొడ్డవరకు చేరుకుని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు.


దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఒడిశా రైలు ప్రమాదం
జూన్ తొలివారం ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో 300 మంది వరకు మృతి చెందగా, 1,100 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొదట కోల్ కతా నుంచి చెన్నైకి వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి గూడ్స్ రైలు ఉన్న లూప్ లోకి వెళ్లి ఢీకొంది. నాలుగైదు బోగీలు పట్టాలు తప్పాయి. మరికొద్ది సేపటికే యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ ఈ రైలును ఢీకొనడంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఈ విషాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోగా, మరికొన్ని కుటుంబాలు చనిపోయిన వారి డెడ్ బాడీని సైతం గుర్తించలేకపోవడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన ప్రయాణికుల కుటుంబసభ్యులకు పరిహారం ప్రకటించాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial