Oberoi Group is all set to build a seven-star hotel in Horseley Hills : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాల్లో ఆంధ్రా ఊటీ గా పేరొందింది హార్సిహిల్స్.  మదనపల్లి పట్టణానికి 15 కిలో మీటర్ల దూరంలో కొలువై ఉంది హార్సిలి హిల్స్. హార్సిలి హిల్స్ అసలు పేరు ఏనుగుల మల్లమ్మ కొండ. ఇక్కడ మల్లమ్మ అనే మహిళ తపస్సు చేసే సమయంలో ఓ ఏనుగు రోజు ఆమెకు పండ్లు తెచ్చేదని... ఆ కొండ కు ఆ పేరు వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. బ్రిటిష్ కాలంలో ముదనపల్లి కలెక్టర్ గా పనిచేసిన W.D హార్సిల్స్ వేసవి కాలం విడిదిగా ఇక్కడ ఇంటిని నిర్మించారు. ఈ కారణంగా ఈ కొండ ను అప్పటి నుంచి హార్సిలి హిల్స్ గా  మారింది.


7 స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రతిపాదనలు   


కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత ఏపీ టూరిజం మినిస్టర్ తిరుపతి పర్యటన లో పర్యాటక శాఖ స్థల పరిశీలన చేసారు. గతంలో  ఒబెరాయ్ హోటల్ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా పరిశీలన చేసారు. తాజాగా అన్నమయ్య జిల్లా అధికారులతో కలిసి ఒబెరాయ్ హోటల్ ప్రతినిధులు పర్యటించారు. సుమారు 200 కోట్ల రూపాయలతో  ఒబెరాయ్ సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్,జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ హార్సిలీ హిల్స్ లో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి ఒబెరాయ్ ప్రతినిధులతో ప్రజెంటేషన్ నిర్వహించారు. హోటల్ నిర్మాణానికి 21 ఎకరాల భూమి స్థల పరిశీలన కూడా చేశారు. రాబోయే రెండు నెలలు పనులు ప్రారంభించడానికి ఒబెరాయి సంస్థ సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు.  


YSRCP Sajjala : సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి - ఆయనను పక్కన పెడితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందా ?


గతంలో తిరుపతిలో నిర్మాణానికి ప్రతిపాదన  
 
ఒబెరాయ్ హోటల్స్ ఏపీ లో నిర్మించాలని గత ప్రభుత్వంలో క్యాబినెట్ లో ఆమోదం తెలిపింది. నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  తిరుపతి జూ పార్క్ రోడ్డు లోని ఏపీ టూరిజం శాఖ కార్యాలయం సమీపంలో 20 ఎకరాలు సైతం కేటాయించారు. అందుకు భూమి పూజ కూడా వర్చువల్ విధానం లో నిర్వహించారు. అప్పట్లో తిరుపతి నగరపాలక సంస్థ సైతం ఆ హోటల్ కోసం ఎస్వీయూ లో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయాలని తీర్మానం చేయడం... ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి ఒబెరాయ్ హోటల్ కోసం వైసీపీ ప్రభుత్వం ఎస్వీయూలో రోడ్లు వేస్తున్నారని నిరసనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే ఆ నాటి నుండి నేటి వరకు ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ తప్ప ఎలాంటి పనులు చేయలేదు.  


పార్టీని వదిలే ప్రసక్తే లేదు - వైసీపీ హైకమాండ్‌కు చల్లని కబురు చెప్పిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు


హోటల్ నిర్మాణం పూర్తయితే టూరిజం వృద్ధి 


  హార్సిలీ హిల్స్ కు ప్రతిరోజు పదుల సంఖ్యలో పర్యాటకులు వస్తూంటారు.   వారంతపు రోజులు... సెలవుల్లో వేలాది మంది పర్యాటకులు ఇక్కడ విడిది చేయడంతో పాటు ఇక్కడి అందాలను చూసి వెళ్తుంటారు. ఈ ప్రాంతంలో అటవీ శాఖ, టూరిజం, ప్రైవేట్ గదులు అందుబాటులో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పర్యాటక శాఖ కు మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు సైతం ప్రారంభించగా ఇందులో ప్రముఖంగా హార్సిలీ హిల్స్ కూడా ఉంది.