Nara Lokesh Yuva Galam Padayatra: యువగళం పాదయాత్రలో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) మాటలకు మరింత పదును పెడుతున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. నగరి నియోజకవర్గంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన ఆర్కే రోజాపై (Minister RK Roja) విమర్శలు చేశారు. అంతేకాక, జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి  రామచంద్రా రెడ్డిపైనా (Peddireddy Ramachandra Reddy) ఆరోపణలు చేశారు. మంత్రి రోజాను ‘జబర్దస్త్ ఆంటీ’ అంటూ లోకేశ్ సంభోదించారు.


సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా మాట్లాడుతూ.. బాబాయిని చంపిన వారిని ఏమంటారని జనాల్ని అడిగారు. వారిని సైకో అంటారని, సీఎం జగన్ (CM Jagan) ప్రతి జిల్లాకు తనలాంటి ఓ సైకోనే తయారు చేస్తున్నారని అన్నారు. చిత్తూరు జిల్లాకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆ సైకో అని విమర్శించారు. ఇక్కడ ఎర్రచందనం, ఇసుక స్మగ్లింగ్ జరిగినా కేరాఫ్ అడ్రస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అని అన్నారు.


‘‘ఆయనకు పోటీగా నగిరి ఎమ్మెల్యే, డైమండ్ పాప రోజా ఉన్నారు. మొన్న నేను పాప అన్నందుకు రోజా ఫీలయ్యారట. అమ్మా క్షమించండి. మీ కోరిక మేరకు మిమ్మల్ని జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తా. మహిళా మంత్రి అయ్యుండి నాకు చీర గాజులు పెడతానని చెప్పింది. అంటే చీర గాజులు కట్టుకొనే వాళ్లు చేతగానోళ్లా? నగిరికి వచ్చా.. చీర గాజులు నాకు పంపించు. నా అక్కా చెల్లెళ్లు, పెద్దమ్మలకు పెట్టి వాళ్ల కాళ్లు నేను మొక్కుతా. అది మేం మహిళలకు ఇచ్చే గౌరవం. 


జబర్దస్త్ (Jabardasth Show) ఆంటీ నగిరికి రాకముందు ఆమె పరిస్థితి ఏంటి? ఆమె రాకముందు ప్రజల పరిస్థితి ఏంటి? తేడా ఆలోచించండి. జబర్దస్త్ ఆంటీ అధికారంలోకి వచ్చాక బెంజ్ కారు వచ్చింది. ఊరూరా విల్లా. చెప్పులు పట్టుకొని తిరిగేందుకు ఓ ప్రభుత్వ అధికారి కూడా ఉన్నారు. వీడియో చూశారా? రోజా జీవితం మారినా, ప్రజల జీవితాలు మారాయా? విజయపురం మండలం, శ్రీహరిపురం, కొసల నగరం ప్రాంతాల్లో జబర్దస్త్ ఆంటీ డైరెక్షన్ ‌లో యమా స్పీడ్‌గా తవ్వేస్తున్నారు. రోజుకి 150 టిప్పర్లు తమిళనాడుకి పోతోంది. పేదల పట్టా భూముల్లో కూడా మట్టి తవ్వకాలు చేస్తోంది జబర్దస్త్ ఆంటీ. వడమలబేడు మండలంలో టీటీడీ ఉద్యోగులకి 400 ఎకరాలు సేకరించి ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే, దళితుల భూములు సేకరించే క్రమంలో ఎకరాకు 20 లక్షలిస్తా.. నాకు 20 శాతం వాటా అడిగింది. ఎమ్మెల్యే అయిన నాటి నుంచి గ్రానైట్, క్వారీ సంస్థలకి ఫోన్ చేసి నాకు వాటా ఎంత అని డిమాండ్ చేసింది. 


లాండ్ కబ్జాలు కూడా రోజా జబర్దస్త్ గా చేస్తున్నారు. విజయపురం మండలం కొలనగరంలో ప్రభుత్వ 35 ఎకరాల భూమి కబ్జా చేసింది. 55 ఎకరాల ప్రభుత్వ భూమి గోవిందా! విశాఖ రుషికొండలో కూడా ఎకరం గోవిందా!’’ అంటూ నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర ఆరోపణలు చేశారు.