చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు సవాల్ చేసిన నారా లోకేష్ పలనాయనం చిత్తగించారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతి మారుతి నగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు సవాల్ చేసిన లోకేష్ పలనాయనం చిత్తగించాడని అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి తంబళ్లపల్లెలోనే ప్రస్తుతం ఉన్నారని అన్నారు.
అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాంమని ఆయన అన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తప్పుడు సమాచారం చెప్పి లోకేష్ తో మాట్లాడిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమర్నాథ్ రెడ్డి స్వయంగా సవాల్ చేసి కనిపించడం లేదని అన్నారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.