నిన్న మొన్నటి వరకూ టమోటా, ఉల్లి, మాంసపు పదార్ధాలకు మాత్రమే రెక్కలు వచ్చాయి.  ధరలు ఆకాశాన్ని అంటాయి. కానీ మార్కెట్‌లో పెరిగిన మునగకాయల ధరలు చూస్తే అవాక్కు అవాల్సిందే. కిలో మునగకాయ ధర ఇప్పుడు నాలుగు వందల రూపాయలకు పైమాటే అంటే నమ్మబుద్దికాదు. 


ఉన్నట్టుండి మునగకాయల ఎందుకింత డిమాండ్ పెరిగిందో అసలు అర్ధం కాక కూరగాయల   వ్యాపారస్తులు తలలు పట్టుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల్లో పెరటి చెట్టుగా పెంచుకునే మునగకాయకి ఇప్పటి వరకూ అంత రేటు రావడం సామాన్య విషయం కాదు. కార్తీక మాసం పూర్తైంది. అయినా కూరగాయల ధరలు ఇంకా దిగి రావడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా వరకు కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. నిన్న మొన్నటి వరకూ సాధారణంగా ఉన్న కూరగాయలు ధరలు దిగుబడి లేక నెమ్మ నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి.. కుండపోత వర్షాల కారణంగా దిగుబడి పూర్తిగా తగ్గి పోయింది. దీంతో అమాతంగా ధరలు ఒక్కసారిగా పెరిగాయి.. 
అయితే ఇలా ఒక్కసారిగా కూరగాయల ధరలు పెరిగడంతో ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. ఇప్పటికే కిలో టమాటా ధర వందను క్రాస్ చేసి మళ్లీ దిగింది. వేరే దిక్కులేక ధర పెరిగినా వినియోగదారులు మాత్రం కొనడం తప్పలేదు. ఇప్పుడు మునక్కాయలు షాక్‌ ఇస్తున్నాయి. దీనికి కూడా భారీ వర్షాలే కారణంగా చెబుతున్నారు వ్యాపారు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో హోటళ్ళు, క్యాటరింగ్ నిర్వాహకులు అధికంగా వాడే వస్తువు కావడంతో ధర పెరిగిందన్న మరో వాదన ఉంది.  ధరలు కారణంగా మనుగకాయలు పట్టుకోవాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. 


మునగకాయలు కేజీ  400 నుంచి 450 వరకూ ధర పలుకుతుంటే కాయలను కొని అమ్మేందుకు కూడా వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. గతంలో కేజీ ఇరవై రూపాయల నుండి నలభై రూపాయల వరకూ ఉండే మునగకాయ ఊహించని ధర రావడంతో వినియోగదారులు కూడా మునగకాయ కొనేందుకు ఆసక్తి చూపడం లేదని వ్యాపారస్తులు అంటున్నారు. ఇరవై కేజీల బ్యాగ్ నాలుగు వేల వరకూ పడుతుందని, మార్కెట్‌లో అవసరం బట్టి దాదాపుగా పది బ్యాగులు కొనుగోలు చేస్తున్నామని లక్షల ఇరవై ఐదు వేల వరకూ పెట్టి కొంటున్నా అమ్ముడు పోవడం లేదని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Income Tax Filing: 31 చివరి తేదీ..! ఐటీఆర్‌ ఆలస్యమైతే పెనాల్టీ తప్పదు..! ఇలా చేయండి..!
Also Read: Social Media: భార్యను ట్రోల్‌ చేశారని.. బ్లాక్‌చైన్‌తో సొంత సోషల్‌ మీడియా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి