TTD Kalyanamastu :  శ్రీవారి సన్నిధిలో .. టీటీడీ సాయంతో పెళ్లి చేసుకోవాలనుకునేవారి కోసం కల్యాణమస్తు పథకాన్ని ప్రారంభించారు. ఆగస్టు  7 వ రాష్ట్రమంతా సామూహికంగా కల్యాణమస్తు జరిపేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.  కల్యాణమస్తు పొందాలనుకునేవారు కల్యాణం తేదీ కంటే ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణమస్తు పథకం మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ఖరారుచేసింది.


కేంద్రంతో సంబంధం లేకుండా ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు - తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !


తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యాలయాల్లో దరఖాస్తులు ! 


టీటీడీ దగ్గర.. టీటీడీ వెబ్‌సైట్‌లో లభించే దరఖాస్తుతో పాటు  వధూవరుల ప్రస్తుత ఫొటోలు దరఖాస్తుతో పాటు జతపరచాలి. విడివిడిగా ఉన్న దరఖాస్తు కాలమ్‌లో వధూవరుల పూర్తి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, వృత్తి, తల్లిదండ్రుల పేర్లు, కులం, గోత్రం, మతం, పూర్తి చిరునామాలను పొందు పరచాలి. స్వీయ అంగీకార పత్రంలో తాము హిందువులని, వెంకటేశ్వరస్వామిపై పూర్తిగా భక్తివిశ్వాసాలు ఉన్నాయని, ఇద్దరం హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోదలిచామని తెలియచేయాలి.


140 మంది మంత్రి అప్పల్రాజు అనుచరులకు వీఐపీ దర్శనాలు ! టీటీడీ రియాక్షన్ ఏంటి ?


దరఖాస్తు ఫారాన్ని పక్కాగా పూర్తి చేయాలి - తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి


జులై 31 నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరం ఉన్నట్లు చూపించాలి. పెళ్లి చేసుకునే సమయానికి మేజర్లమని తెలపాలి. మానసిక సమస్యలు ఏం లేవని తెలియజేయాలి. వధూవరుల వయస్సు నిర్ధారణ కోసం పాఠశాల సర్టిఫికెట్‌ లేదా ఆధార్‌కార్డు జత చేయాలి. తల్లిదండ్రుల ఆధార్‌ జిరాక్స్ కూడా జత చేయాలి. వధూవరులు వేర్వేరు మండలాలకు చెందిన వారైతే తహసీల్దార్‌ ధ్రువీకరణ ఉండాలి.ఇంతకుముందు తమకు వివాహం కాలేదని సెక్షన్‌-8 హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం రిజిష్టర్‌ చేయించుకునే బాధ్యత తమదని తెలియజేయాలి.


తిరుపతిని సర్వనాశనం చేశారు - వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుపై అశ్వనీదత్ విమర్శలు


నిరుపేదలకు ఎంతో ఉపయోగకరం ఈ పథకం 


నిరుపేదల పెళ్లిళ్లకు సాయం చేసేందుకు  2007 లో  టీటీడీ  కల్యాణమస్తు కార్యక్రమాన్ని  ప్రారంభించారు. టీటీడీ తరఫున నిర్వహించే ఈ కార్యక్రమంలో పెండ్లి చేసుకునే జంటకు బంగారు తాళి బొట్టు, పెండ్లి దుస్తులతోపాటు 50 మంది బంధువులకు భోజన ఏర్పాట్లు చేసేవారు. 2007 నుంచి 2011 వరకు రెండు విడతల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత నిలిచిపోయింది. మళ్లీఇప్పుడు ప్రారంభిస్తున్నారు.