Deepika Padukone in Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తిరుమలకు చేరుకున్నారు.. గురువారం (డిసెంబర్ 14) రాత్రి అలిపిరి కాలిబాట మార్గం గుండా గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి తిరుమల కొండపైకి చేరుకున్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు నడుచుకుంటూ దీపికా పదుకొణె తిరుమలకు చేరుకున్నారు. మెట్ల మార్గంలో నడుచుకుంటూ వస్తున్న దీపికా పదుకుణెతో భక్తులు సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అనంతరం తిరుమలలోని రాధేయం అతిధి గృహానికి చేరుకున్న దీపికా అక్కడే బస చేశారు. ఇవాళ రాత్రి తిరుమలలో బస చేసి, శుక్రవారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో, వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దీపిక దర్శించుకోనున్నారు.
Deepika Padukone: తిరుమలకు దీపికా పదుకొణె, మెట్ల మార్గంలో కాలినడకన కొండపైకి
ABP Desam
Updated at:
14 Dec 2023 09:51 PM (IST)
Deepika Padukone News: దీపికా పదుకుణెతో భక్తులు సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అనంతరం తిరుమలలోని రాధేయం అతిధి గృహానికి చేరుకున్న దీపికా అక్కడే బస చేశారు.
మెట్ల మార్గంలో తిరుమలకు నడుస్తూ వెళ్తున్న దీపికా పదుకొణె