Tirupati Michuang Updates: చేపల సరదా ఓ‌ బాలుడి ప్రాణం బలిగొన్న ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా చేరుకోవడంతో పాటుగా, కాలువలు పూర్తిగా వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సత్యనారాయణపురంకు చెందిన నిఖిల్ అనే 10 ఏళ్ళ బాలుడు తన తాతతో‌ కలిసి చేపలు పట్టేందుకు వెళ్లాడు. సరదాగా మంగళంలోని రిక్షా కాలనీకి‌ సమీపంలో‌ ఉన్న కల్వర్ట్ వద్దకు చేరుకున్నారు.. తాతతో కలిసి చేపలు పడుతున్న సమయంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కల్వర్ట్ లో జారి పడ్డాడు.. 


ఈ ఘటనను ఏమాత్రం గుర్తించని తాత, తోటి చిన్నారులు, పెద్దలు చేపలు పట్టే పనిలో మునిగి పోయారు.. దాదాపు ఇవాళ మధ్యాహ్నం 2 గంటల‌ ప్రాంతంలో బాలుడు గల్లంతు కాగా, సుమారు సాయంత్రం 4 గంటల‌ ప్రాంతంలో‌ బాలుడు గల్లంతు అయ్యినట్లు గుర్తించి గాలించినప్పటికీ ఏ మాత్రం బాలుడు ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.. ఘటన స్థలానికి చేరుకున్న తిరుచానూరు ‌పోలీసులు స్థానికుల సహాయంతో బాలుడు ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు.. కానీ బాలుడు ఆచూకీ లభించలేదు.. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. చీకటి పడడంతో బాలుడి గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు తిరుచానూరు పోలీసులు.. ఏది ఏమైనప్పటికీ చేపల సరదా ఓ పదేళ్ళ బాలుడి ప్రాణాలను బలిగొని కుటుంబంలో విషాదం నింపింది.