Food Poisoning in Annamaiya district: మదనపల్లె: బల్లిపడిన ఆహారం‌ తిని విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. మదనపల్లె మండలంలోని బొమ్మనుచెరువు పంచాయతీ టేకులపాళ్యం‌ ప్రభుత్వ పాఠశాలలో యథావిధిగా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తయారు చేస్తున్న సమయంలో బల్లి ఆహారంలో పడింది. ఇది గమనించని వంట మనుషులు ఆ ఆహారంను నేరుగా విద్యార్ధులకు వడించారు. దీంతో ఆ ఆహారం తిన్న విద్యార్థులు 45 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బల్లి పడిన ఆహారాన్ని విద్యార్ధులకు వడ్డించిన వారిపై, సంబంధిత వ్యక్తులపూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్ధులకు అందించే భోజనం తయారు చేసే సమయంలో నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.