ఏపీ పర్యటక శాఖ మంత్రి రోజాను సినీనటి రమ్యకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకి చేరుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం నగిరిలోని మంత్రి ఆర్కే రోజా స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా సినీనటి రమ్యకృష్ణకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోజా స్వగృహంలో అల్పాహారం స్వీకరించిన రామకృష్ణ కొంత సమయంపాటు తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. అనంతరం అభిమానులు ఆమెకు శాలువాతో సత్కరించి సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.


రమ్యక్రిష్ణ, రోజా ఇద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్నేళ్ల క్రితం అగ్ర హీరోయిన్లుగా వెలుగొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రమ్యక్రిష్ణ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ సినిమాలు కొనసాగిస్తుండగా, రోజా రాజకీయాల్లో మంత్రిగా బిజీగా ఉన్నారు.


తిరుమల శ్రీవారి సేవలో రమ్యకృష్ణ
నటి రమ్యకృష్ణ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె కుమారుడు రిత్విక్ వంశీతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన రమ్యకృష్ణతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆమెను చూసిన కొంత మంది ఆసక్తి కనబరిచారు.


రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణవంశీ భార్య. దాదాపు ప్రతి అగ్రకథానాయకుడి సరసన ఈమె నటించారు. ఎనిమిదో తరగతి చదువుతూనే తమిళంలో ‘వెల్లై మనసు’లో ప్రధాన ప్రాత పోషించారు. 1986లో వచ్చిన భలే మిత్రులు చిత్రంతో హీరోయిన్ తెలుగు చిత్రరంగంలోకి అరంగేట్రం చేశారు. 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రంద్వారా మంచినటిగా పేరు సంపాదించారు. 1992లో విడుదలైన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుంచి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో ఈమె వరుసగా పాత్రలు పోషించారు. దాదాపు అవన్నీ విజయవంతమైయ్యాయి.


1990 నుంచి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో రమ్యక్రిష్ణ హీరోయిన్ గా రాణించారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ‘బాల మిత్రులు’ 1987లో విడుదల అయింది. కె. రాఘంద్రేరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగింది. దాదాపుగా తెలుగుహీరోలు అందరితోనూ ఆమెకు విజయవంతమైన సినిమాలు ఉన్నాయి.