Roja Controversy: కొందర్ని వివాదాలే వెతుక్కొని వెళ్తుంటాయి. మరికొందరు వివాదాల్నే వెతుక్కొని మరీ సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. మాజీ మంత్రి రోజా మాత్రం మొదటి రకం. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ వివాదం చుట్టుముడుతుంది. వివాదాలు ఆమె చుట్టూ వైఫైలా తిరుగుతుంటాయి. ఇప్పుడు కూడా రోజా ఓ వివాదంలో చిక్కుకున్నారు. 


రోజా ఈ మధ్య కాలంలో తమిళనాడులోని ఓ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. రోజా, సెల్వమణి దంపతులు ఇద్దరూ గుడిలో పూజలు చేసి వస్తున్న క్రమంలో సెల్ఫీలు ఇవ్వడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బింధువుగా మారింది. ఈ టైంలో ఆమె చేసిన సైగలు సమస్యల్లో పడేశాయి. ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
మాజీ మంత్రి మొన్న సోమవారం తమిళనాడులోని తిరుచ్చెందూర్‌ సుబ్రమణియస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. భర్తతో కలిసి ప్రత్యేక పూజలు కూడా చేశారు. దర్శనం చేసుకున్న వస్తున్న టైంలో వారిని చూసిన అక్కడి భక్తులు, సిబ్బంది సెల్ఫీలు ఇవ్వాలని రిక్వస్ట్ చేశారు. రోజా, సెల్వమణి దంపతులిద్దరూ నవ్వుతూ సెల్ఫీలు ఇచ్చారు. 






అయితే గుడిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కూడా రోజాతో సెల్ఫీ దిగుతామని పరుగెత్తుకొని వచ్చారు. అలా వస్తున్న క్రమంలో రోజా వాళ్లకు సైగ చేశారు. అయితే ఆ సైగ హాయ్‌ చెప్పారో లేకా దూరంగా ఉండాలని చెప్పారో తెలియదు కానీ ఇప్పుడు వివాదానికి ఆ సైగలే కారణమవుతున్నాయి. 


పారిశుద్ధ్య కార్మికులు వస్తుండగా దూరంగా ఉండాలంటూ రోజా సైగలు చేశారని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అందరితో చాలా క్లోజ్‌గా ఉంటూ ఫొటోలు దిగిన రోజా పారిశుద్ధ్య కార్మికులను మాత్రం దూరం పెట్టారు. దీన్నే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.