10th Results Row :  ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయడానికి ముహుర్తం ఖరారు చేసి చివరి క్షణంలో వాయిదా వేశారు. ఫలితాలు అన్నీ రెడీ అయినప్పటికీ ఎందుకు వాయిదా వేశారో.. విడుదల కార్యక్రమం కోసం వచ్చిన మీడియా ప్రతినిధులకు కూడా అర్థం కాలేదు. కానీ అనివార్య కారణాల వల్లనే ఫలితాలు విడుదల చేయడం లేదని సందేశం మాత్రం పంపించారు. ఆ అనివార్య కారణాలేమిటన్నది మాత్రం సస్పెన్స్‌గానే ఉన్నాయి. 


దాడులు - దౌర్జన్యాలు ! వైఎస్ఆర్‌సీపీకి భారంగా మారుతున్న తూ.గో జిల్లా నేతలు !


అయితే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సమాచారం ఇవ్వకుండానే ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేశారని .. విషయం తెలిసి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కార్యక్రమం వాయిదా వేశారన్న ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఎలాంటి పరీక్షల ఫలితాలు అయినా మంత్రి చేతుల మీదుగా విడుదల చేయడం ఆనవాయితీ. ఆయన అందుబాటులో లేకపోతే అధికారులు విడుదల చేస్తారు. అయితే ప్రభుత్వ పరీక్ష విభాగం డైరక్టర్ దేవానంద్ రెడ్డి పదో తరగతి ఫలితాలు రెడీ కావడంతో తానే స్వయంగా ఫలితాల విడుదల తేదీని ఖరారు చేసి ప్రకటించారు.


ఏపీలో బీజేపీకి దూరమవడమే పవన్ వ్యూహం - జనసేనాధినేత క్లారిటీకి వచ్చేశారా ?


అయితే ఈ ప్రక్రియలో విద్యా మంత్రి బొత్స సత్యనారాయణను భాగం చేయడం మర్చిపోయారని అంటున్నారు. ఈ కారణంగా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరి క్షణంలో పరీక్షా ఫలితాల ప్రకటన సోమవారానికి వాయిదా పడినట్లుగా తెలస్తోంది. అయితే ఇలా పరీక్షా ఫలితాలు నిలిపివేయడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇలాంటి పరిపాలన ఎప్పుడూ చూడలేదని నారా లోకేష్ విమర్శించారు. 



ఏపీలో దాదాపుగా ఆరు లక్షల మంది విద్యార్థుల టెన్త్ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. చివరి క్షణంలో వాయిదా వేయడంతో వారంతా టెన్షన్ పడుతున్నారు.   సోమవారం వరకూ వారికి ఎదురు చూపులు తప్పవు. 


ఎమ్మెల్యే పిన్నెల్లిని బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలి: బుద్దా వెంకన్న డిమాండ్