Tenali Double Horse brand stall at the Gulf Food Festival  :  దుబాయ్‌లో జరిగే గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ లో తెలుగు రుచులు హైలెట్ అయ్యాయి.  ఈ నెల 19 నుండి 23 వరకు దుబాయి లోని దుబాయి ట్రేడ్ సెంటర్ లో, 22 వ గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి 127 దేశాల నుంచి పలు ఆహార సంస్థల తయారీదారులు వీక్షకులు గా వచ్చారు. అక్కడ మన తెనాలి డబల్ హార్స్ సంస్థ తన స్టాల్ ని ఏర్పాటు చేసింది.  తెనాలి డబల్ హార్స్ సంస్థ ఇటీవలి కాలం లో తన ఉత్పత్తుల విస్తృతి ని బాగా పెంచి, ప్రపంచం లోని ఎన్నో దేశాలకు తమ ప్రాడక్ట్ లను అందజేయటం చేస్తోంది.            

  


ఈ సందర్భంగా తెనాలి డబల్ హార్స్ ఉత్పత్తులను పలు దేశాల ప్రతినిధులు ఇక్కడ వీక్షించి, చక్కని అనుభూతిని చెందారు. ఈ సందర్భంగా తెనాలి డబల్ హార్స్ సంస్థ ప్రపంచ ప్రమాణాలని, ప్రపంచ మార్కెట్ అవసరాలని, భవిష్యత్ వ్యూహాలని అర్థం చేసుకోవటం లో ఈ గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది అని, అలాగే తెనాలి డబల్ హార్స్ సంస్థ ఉత్పత్తులు ప్రపంచ దేశాల ప్రజలకు, ప్రతినిధులకు బాగా చేరువయ్యాయని అలాగే రూరల్ టు గ్లోబల్ అనే నినాదంతో మేడ్ ఇన్ తెనాలి మేడ్ ఫర్ గ్లోబల్ తో ముందుకెళుతున్నాం అని తెనాలి డబల్ హార్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  మునగాల శ్యామ్ ప్రసాద్  ప్రకటించారు. 


0 రకాల ఉత్పత్తులను ప్రదర్శనగా ఉంచిందని,. పప్పులు, ఇన్‌స్టెంట్‌ పొడులు, స్వీట్స్‌, రెడీ టు కుక్‌, రెడీ టు ఈట్‌ (మీల్స్‌), చిక్లెట్స్‌, స్పైసెస్‌, పికిల్స్‌, మిల్లెట్స్‌ వంటివి ప్రదర్శనలో ఉంచారు. దాదాపు 127 దేశాలకు చెందిన ఆహార ప్రియులు ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌ను వీక్షిస్తున్నారు. ఫుడ్‌ ఫెస్టివల్‌ ఆహార ప్రియుల భవిష్యత్‌ అవసరాలను అర్ధం చేసుకునేందుకు, వారి డిమాండ్‌కు తగినట్టుగా వ్యాపార విస్తరణకు ఎంతగానో ఉపయోగ పడుతుందని సంస్థ ఎండి మునగాల శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. ఈ ప్రదర్శన ద్వారా తమ సంస్థ ఉత్పత్తులు వివిద దేశాల ప్రతినిధులకు, ప్రతినిధులకు చేరువయ్యాయని, అవి వారిని విశేషంగా ఆకర్షించాయని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని విస్తరింప చేస్తామన్నారు.                     


డబుల్ హార్స్  బ్రాండ్ తెలుగు అత్యంత వేగంగా ఎదుగుతున్న కంపెనీ. ఈ కంపెనీ ఉత్పత్తులు.. మంచి క్వాలిటీతో ఉంటాయి కాబట్టి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడు విదేశీ మార్కెట్ పైనా దృష్టి పెట్టారు. దుబాయ్ స్టాల్ ద్వారా..  త్వరలో అంతర్జాతీయ మార్కెట్ లోనూ తమదైన ముద్ర వేస్తామని నమ్మకంతో ఉన్నారు.