Rain Alert: తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఈరోజు రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో కచ్చితంగా వర్షం పడుతుందని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నారాయణ్ పేట్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 






ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ, దక్షిణ ఆంధ్రలో ఉరుములు, మెరుపులో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. అనంతపురం, శ్రీ సత్య సాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్ కడప. నంద్యాల్, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కోనసీమ, అనకపల్లి, విజయనగరం జిల్లాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. కర్నూలు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, పార్వతీపురం, మన్యం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.






రాగల 3 రోజులకు వాతావరణ సూచన : 


ఈ రోజే కాకుండా రేపు కూడా రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు  వర్షాలు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు భారీ వర్షాలు, ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని (ఉత్తర, తూర్పు) జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.


హైదరాబాద్‌లో వాతావరణం


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.3 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 86 శాతంగా నమోదైంది.


బిహార్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాన్ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో వాయుగుండం లేదా తుపాను ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.