తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబునాయుడు పరామర్శించారు. తనపై దాడికి రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధాకృష్ణ ఆరోపణలు చేసిన తర్వాత ఎక్కువగా తాడేపల్లిలోని ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు. తనను పరామర్శించడానికి వచ్చే వారితో అక్కడే సమావేశం అవుతున్నారు. చంద్రబాబు కూడా తాడేపల్లిలోని ఇంటికే వెళ్లారు. వంగవీటి ాధాకృష్ణను రెక్కీ గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ తల్లి కూడా ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
Also Read: పని చేయని వాళ్లను పక్కన పెడతా.. చంద్రబాబు కొత్త ఏడాది రిజల్యూషన్ !
రెక్కీ నిర్వహించిన దానికి సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని సమావేశం తర్వాత చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు అసలేమీ చెప్పడం లేదన్నారు. రాధా రెక్కీ విషయం చెప్పిన తర్వాత అసలేం జరిగిందన్నదానిపై ఆందరిలోనూ ఆందోళన ఏర్పడిందన్నారు. ఆ దిశగా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఏమీ లేవన్నారు. ఇలాంటి పనులు చేసే వారిని పట్టుకుని శిక్షిస్తే మరొకరు అలాంటి ప్రయత్నాలు చేయరని చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పోలీసులు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరిగినా తర్వాత మాత్రం ఖండించారు. దీంతో రెక్కీ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేరని వంగవటి రాధా వర్గీయులు భావిస్తున్నారు.
Also Read: జగన్ పాలనకు 30 నెలలు.. ప్రజాసేవకు పునరంకితం అవుతున్నాం.. : సజ్జల
వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణ తనపై రెక్కీ నిర్వహించిన విషయాన్ని బయట పెట్టారు. ఈ అంశం సంచలనం సృష్టించింది. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంక్షంలోనే వంగవీటి రాధాకృష్ణ ఆ ఆరోపణలు చేశారు. తర్వాత కొడాలి నాని సీఎం జగన్‌తో మాట్లాడి నలుగురు గన్‌మెన్ల రక్షణ ఏర్పాటు చేయించారు. అయితే ఆ గన్‌మెన్లు తనకు అవసరం లేదని రాధాకృష్ణ తిప్పి పంపేశారు. తనను రంగా అభిమానులే కాపాడుకుంటారని అన్నారు.
Also Read: టిక్కెట్ రేట్ల తగ్గింపును విమర్శించేవారు శత్రువులే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు !
రెక్కీ అంశం గురించి తెలిసిన తర్వాత పలువురు టీడీపీ ేతలు వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. చంద్రబాబు కూడా ఈ అంశంపై డీజీపీకి లేఖ రాశారు. వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అదే సమయంమలో వంగవీటి రాధాకు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. గన్‌మెన్లను తిరస్కరించడం సరి కాదని.. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లుగా తెలుస్తోంది.