వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చి 30 నెలలు పూర్తి చేసుకుందని.. ప్రజాసేవకు పునరంకితం అవుతున్నామని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నూతన సంవత్సరం, ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు అయిన సందర్భంగా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. 30 నెలల కాలంలో రూ. లక్షా పదహారు వేల కోట్లను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేశామని.. దేశ చరిత్రలోనే ఇలా చేయడం తొలిసారి అని సజ్జల అన్నారు.  పారదర్శకతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.  


Also Read: టిక్కెట్ రేట్ల తగ్గింపును విమర్శించేవారు శత్రువులే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు !


వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్షా 30వేల ఉద్యోగాలు కల్పించామని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. క్యాలెండర్ ప్రకారం పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. అయితే తాము వీటిని ప్రచారం చేసుకోకలేకపోతున్నామని.. బాధ్యతగా ఉద్యోగాలు మాత్రం కల్పిస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా ప్రతీ ఏటా ఇబ్బంది పెడుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలలు మాత్రం ఒకింత వెసులుబాటుతో పాలించిన జగన్.. ఆ తర్వాత ఎదురైన సవాళ్లను తట్టుకుంటూ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. 


Also Read: హీరోలతోనే సమస్య... టికెట్ల రేట్లపై ప్రభుత్వం పునరాలోచించాలి... టికెట్ల వివాదంపై ఎన్వీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు


సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకువచ్చిన పథకాలు సామాన్యమైనవి కావని, గ్రామ సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ ప్రస్తుతం జనజీవనంలో భాగమయ్యాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం 30 నెలల పాలన పూర్తి చేసుకుందని అన్నారు. వైసీపీ ప్రజా సేవకే పునరంకితం అయిందని తెలిపారు. ఏపీ పునర్విభజన తర్వాత 5 ఏళ్లు టీడీపీ పాలన చూసిన ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. అభివృద్దిపై ఆశగా ఉన్న ప్రజలు.. వైఎస్ జగన్ మీద నమ్మకంతో వైఎస్సార్‌సీపీని ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. కొత్త ఏడాది రాష్ట్ర ప్రజలకు శుభం చేకూరాలని సజ్జల రామకృష్ణారెడ్డి  ఆకాంక్షించారు.  


Also Read: కమిటీ నివేదిక వచ్చాక తుది టిక్కెట్ ధరల ఖరారు - డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పేర్ని నాని ప్రకటన !



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి