ABP  WhatsApp

Paritala Sunita : వైసీపీ ప్రభుత్వంలో ఎలుకల మద్యం తాగుతాయ్, ఉడుతల కరెంట్ వైర్లు తెంపేస్తాయ్- మాజీ మంత్రి పరిటాల సునీత

ABP Desam Updated at: 01 Jul 2022 03:20 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Paritala Sunita : 'ఎలుకలు మద్యం తాగుతాయ్, కుక్కలు సాక్ష్యాలు ఎత్తుకెళ్తాయ్, ఉడుతల కరెంట్ తీగలు తెంపేస్తాయ్' అంటూ మాజీ మంత్రి పరిటాల సునీత వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేశారు.

మాజీ మంత్రి పరిటాల సునీత

NEXT PREV

Paritala Sunita : వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 'ఎలుకలు మద్యం తాగుతాయ్, కుక్కలు సాక్ష్యాలు ఎత్తుకెళ్తాయ్..ఉడుతలు కరెంట్ తీగలు తెంపేసి 5 మందిని చంపుతాయ్' అంటూ పరిటాల సునీత చురకలు అంటించారు. ఇలా సాకులు చెబుతూ ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, స్వార్థంతో ప్రజలను బలి చేస్తారా అని నిలదీశారు. తాడిమర్రి మండలంలో ఆటోపై హై టెన్షన్ వైర్ పడి ఐదుగురు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు. గాయపడిన వారికి రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. బాధితుల కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, వారి పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఆమె కోరారు. 


నిర్లక్ష్యానికి నిదర్శనం 



తాడిమర్రిలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. పనిపోయే కూలీలకు అలా జరగడం బాధాకరం. ఇది విద్యుత్ అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనం. విద్యుత్ అధికారులు నాసిరకం పనులు చేశారు. అందువల్ల ఐదుగురు మరణించారు. విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తున్నా.... ఉడుత పోతేనే వైర్ తెగిపోతుందా? అంత నాసిరకం వైర్లు వేస్తున్నారా? పైనున్న అధికారులు ఏంచేస్తున్నారు. ఒకరేమో కోర్టులో కుక్కలు ఫైల్ ఎత్తుకొచ్చిందన్నారు. ఇంకోచోట ఎలుకలు మందుతాగేశాయ్ అంటారు. అన్నీ ఈ ప్రభుత్వంలో జరుగుతాయి. ఇవాళ మన జిల్లాలో ఉడుతలు ఎలక్ట్రిక్ వైర్లను కొట్టేస్తుంది. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. - - మాజీ మంత్రి పరిటాల సునీత 


తాడిమర్రిలో ఘోర ప్రమాదం 


శ్రీ సత్యసాయి జిల్లాల ఘోరమైన ప్రమాదం జరిగింది. తాడిమర్రి మండలం బుడంపల్లికి చెందిన రైతు కూలీలు ఓ ఆటోలో వెళ్తుండగా, హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి ఆటోపై పడింది. దీంతో వెంటనే మంటలు చెలరేగి పలువురు కూలీలు సజీవ దహనం అయ్యారు. మొత్తం 5 మంది రైతు కూలీలు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. ఈ చనిపోయిన వారంతా గుండంపల్లి వాసులుగా గుర్తించారు. వీరంతా వ్యవసాయ పనుల కోసం ఓ ఆటోలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో 7గురు తీవ్రంగా గాయపడ్డారు. 


Also Read : Movie Tickets Issue: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!


Also Read: AP Govt GPF Issue : ఉద్యోగుల ఖాతాల్లో నగదు మాయంపై న్యాయపోరాటం చేస్తాం - సూర్యనారాయణ 

Published at: 01 Jul 2022 03:17 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.