ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీప బంధువు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల నియోజకవర్గం చక్రాయపల్లి ఇంచార్జ్‌గా ఉన్న వైఎస్ కొండారెడ్డికి ( YS Konda Reddy )  లక్కిరెడ్డి పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనను రెండు రోజుల కిందట ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించారన్న కారణంగా పోలీసులు అరెస్ట్ ( Kondareddy Arrest ) చేశారు. రెండు రోజుల్లో ఆయనకు బెయిల్ లభించింది. అయితే ఆయనపై జిల్లా బహిష్కరణ వేటు వేయాలని ఎస్పీ ( Kadapa SP ) సిఫారసు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సిఫారసును జిల్లా కలెక్టర్‌కు పంపినట్లుగా తెలుస్తోంది. దీనిపై కలెక్టర్ నిర్ణయం ఏమిటో తెలియాల్సి ఉంది. 


నవరత్నాలు గుర్తు లేని అంబటి - "ఆసరా" గురించి తెలియక ఎంత ఇబ్బంది పడ్డారంటే ?


వైఎస్ కొండారెడ్డి .. వైఎస్ కుటుంబంలో ( YS Family ) కీలక వ్యక్తి. చక్రాయపేట మండలంలో అన్నీ తానై వ్యవహరిస్తూంటారు. ఈ క్రమంలో పులివెందుల- రాయచోటి మార్గంలో జాతీయ రహదారిని నిర్మిస్తున్న  ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టర్లను ఆయన  బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. రూ. ఐదు కోట్లు ( Five Cores ) ఇవ్వకపోతే పనులు చేయనివ్వబోమని ఆయన అనుచరులతో కలిసి అడ్డగించినట్లుగా చెబుతున్నారు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ ఛేశారు. అయితే ముఖఅయమంత్రి సన్నిహిత బంధువును అంత తేలిగ్గా అరెస్ట్ చేయరని తెర వెనుక ఏదో జరిగిందని కడప జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎస్ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్ ( SRK Constructions ) సంస్థ కర్ణాటక మంత్రి బి.శ్రీరాములు వియ్యంకుడదని .. ఆయన తమకు వస్తున్న బెదిరింపుల గురించి  బీజేపీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారని అంటున్నారు. బీజేపీ హైకమాండ్ కన్నెర్ర చేయడంతోనే ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. 


గుంతల్లేని రోడ్లను తయారు చేయాలి - ఏడాదిలో గణనీయ ప్రగతి కనిపించాలన్న సీఎం జగన్ !
 
బెయిల్ వచ్చిన వెంటనే కొండారెడ్డి రాయచోటి సబ్ జైలు ( Rayachoti Sub Jail ) నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఎస్పీ జిల్లా బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి బంధువుపై ఎస్పీ ఇంత కఠిన నిర్ణయం తీసుకోరని.. పై స్థాయి నుంచి  ఆదేశాలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ( CM Jagan Relative )  బంధువు అయినప్పటికీ ఆయనపై తీవ్ర అభియోగాలు వచ్చినందున జిల్లా బహిష్కరణ మంచిదని ప్రభుత్వ పెద్దలు కూడా భావించినట్లుగా తెలుస్తోంది.